Advertisement
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ ఈనెల 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోవడం వల్ల ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన చార్మికి కూడా భారీ మొత్తంలో నష్టాలు తప్పవని చెప్పవచ్చు.
Advertisement
ఇక లైగర్ తో పాటు గతంలో పలు సినిమాలు కూడా ఛార్మికి భారీగా షాక్ ఇవ్వడం గమనార్హం. ఇది ఇలా ఉంటే మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమిక తకిట తకిట అనే సినిమాను నిర్మించగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో చార్మి గోర నష్టాలను చవి చూసింది. అయితే, చార్మిలాగే నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్ కూడా ఉంది. వారెవరో ఇప్పుడు చూద్దాం.
#1 జయసుధ : ‘కాంచన సీత’, ‘కలికాలం’, ‘అదృష్టం’, ‘వింత కోడళ్ళు’ వంటి చిత్రాలు నిర్మించి ఈమె సంపాదించింది అంతా నష్టపోయింది.
#2 భూమిక: ‘తకిట తకిట’ అనే చిత్రాన్ని రూ. 2 కోట్ల బడ్జెట్ లో నిర్మించి కోటి పైనే నష్టపోయింది భూమిక.
Advertisement
#3 విజయశాంతి: బాలకృష్ణ హీరోగా నటించిన ‘నిప్పురవ్వ’ అనే చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించి భారీగా నష్టపోయింది విజయశాంతి.
#4 మంజుల ఘట్టమనేని : ఈమె ‘షో’ చిత్రంలో హీరోయిన్ గా నటించడమే కాకుండా ఆ చిత్రాన్ని నిర్మించింది. అటు తర్వాత మహేష్ తో ‘నాని’ చిత్రాన్ని నిర్మించింది. అంతేకాకుండా ‘కావ్యాస్ డైరీస్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. ఆ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి.
#5 రోజా: తన భర్త సేల్వమని దర్శకత్వం వహించిన ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలని, ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది రోజా.
#6 శ్రీదేవి: ఈమె కూడా సహనిర్మాతగా కొన్ని చిత్రాలను రూపొందించి కోట్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.
#7 చార్మి: ‘మెహబూబా’, ‘పైసా వసూల్’ తాజాగా ‘లైగర్’ వంటి చిత్రాలను నిర్మించి కోట్లు నష్టపోయింది. ఇంకా సినిమాలు నిర్మిస్తూనే ఉంది.
Read also: టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా, ఎంతో తెలిస్తే అవాక్కే !