Advertisement
సినిమాల్లో కంటెంట్ ఉండాలే గానీ తప్పకుండా హిట్ అవుతుందని నిరూపించింది సీతారామం మూవీ.. కథ లేకుండా ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన ప్రేక్షకులు విసిరి పారేస్తారు. తక్కువ బడ్జెట్ పెట్టిన కథ బాగుండి ప్రేక్షకుల మనసు తాకితే ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అలా ఈ మధ్యకాలంలో వచ్చిన సీతారామం మూవీ చిత్ర యూనిట్ అనుకున్నదానికంటే ఎక్కువగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేశారు.. ఈ సినిమాతోనే మృణాల్ ఠాగూర్ తెలుగు తెరకు పరిచయమయ్యారు.
Advertisement
ఇవి కూడా చదవండి: పూజలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని తినరు.. కారణం..!!
ఇది ఇలా ఉండగా పడి పడి లేచే మనసు, లై వంటి రెండు ఫ్లాప్ చిత్రాలు ఇచ్చిన హను రాఘవపూడి కి ఈ సినిమా మంచి విజయాన్ని మాత్రమే కాదు, మన టాలీవుడ్ దర్శకుల సత్తాను మరోసారి సౌత్ ఇండియా ముందు చూపిందనే చెప్పుకోవాలి. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే ఈ రెండు సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్న ఎందుకు మరో మారు సీతారామం వంటి సినిమాను చేయడానికి మన టాలీవుడ్ హీరోలు ముందుకు రాలేదు. మొదట ఈ సినిమాని అందరూ టాలీవుడ్ లో రిజెక్ట్ చేయగా దుల్కర్ సల్మాన్ మాత్రం కథ విన్న తర్వాత కచ్చితంగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.
Advertisement
ఇవి కూడా చదవండి: సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు
దుల్కర్ నమ్మకాన్ని హను రాఘవపూడి వమ్ము చేయలేదు. మొదట ఈ సినిమాని హీరో రామ్ కి వినిపించగా తనకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నాచురల్ స్టార్ నానికి సైతం కథ వినిపించడంతో ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చి కెరియర్ రిస్క్ లో పెట్టుకోవడం ఇష్టం లేక నో చెప్పేసాడు. దాంతో ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కి వెళ్ళింది. ఏది ఏమైనా రామ్ లేదా నాని లాంటి స్టార్ హీరోలు ఈ సినిమా చేసి ఉంటే వారి కెరియర్ మరొక స్టెప్ పైకెక్కి ఉండేది.
ఇవి కూడా చదవండి: ‘పోకిరి’ రీ- రిలీజ్ దెబ్బకు..ఆ నలుగురు హీరోల సినిమాలు విడుదల చేయాలని డిమాండ్లు