Advertisement
సినిమాలో హీరో స్టైల్ గా సిగరెట్టు కాలుస్తుంటే, ఆ హీరో అభిమానులు మురిసిపోతూ ఉంటారు. మా హీరో చూడండి రా, ఎంత స్టైల్ గా సిగరెట్టు కాలుస్తున్నాడో అంటూ తమ స్నేహితుల దగ్గర కాలర్ ఎగరేసుకుని మరీ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడితో ఆగిపోతే పర్వాలేదు, కానీ సిగరెట్టు కాలుస్తున్న హీరోని స్ఫూర్తిగా తీసుకొని ఆ అభిమాని కూడా ధూమపానం మొదలుపెడితే తర్వాత అతను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిజజీవితంలో చాలా మంది ఇలా అనుసరిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. అయితే సిగరెట్టు మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన పది మంది హీరోల లిస్ట్ ఇప్పుడు చూద్దాం
Advertisement
# రజినీకాంత్
సిగరెట్టు లేదా చుట్టని స్టైల్ గా కాల్చడంలో రజనీకి ఎవ్వరు సాటిరారు. ఆయన స్మోకింగ్ చేసే స్టైల్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఈయన స్మోకింగ్ చేసేవారు. నిజానికి ఈయన స్టైల్ గా సిగరెట్టు కాల్చడం చూసి ఓ పెద్దాయన రజనీని సినిమాలోకి తీసుకొచ్చారు. అయితే 2012 డిసెంబర్ 12న రజని స్మోకింగ్ చేయడం మానేస్తున్నట్టు తెలియజేశారు. తన అభిమానులను కూడా దాని జోలికి పోకూడదని కోరారు. ఇందుకు ముఖ్య కారణం ఆయన మనవడు అని తెలుస్తోంది. రజనీ స్మోకింగ్ చేసి తన మనవడి వద్దకు వెళ్తే అతను రజనీ దగ్గరకు రావడం లేదట. దాంతో ఆ అలవాటుకి స్వస్తి చెప్పేసారు రజిని.
# కమల్ హాసన్
11 ఏళ్ల వయసులోనే సిగరెట్టు కాల్చడం మొదలుపెట్టారు కమల్. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ అలవాటుకు స్వస్తి చెప్పారు. లిప్ లాకులు ఎక్కువగా పెడుతుంటాను కాబట్టి హీరోయిన్లు ఇబ్బంది పడకూడదని స్మోకింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతున్నాను అంటూ ఓ సందర్భంలో కమల్ సరదాగా దీనిపై స్పందించారు.
# మహేష్ బాబు
Advertisement
తన స్నేహితుడు ఇచ్చిన ఓ పుస్తకాన్ని చదివిన తర్వాత మహేష్ స్మోకింగ్ హ్యబిట్ ను వదిలేశాడు. గతంలో పోకిరి, అతిధి సినిమాల టైములో ఇతను గ్యాప్ లేకుండా స్మోక్ చేసే వాడట. కానీ ఇప్పుడు ఆ సన్నివేశాల్లో నటించడానికి కూడా మహేష్ ఇష్టపడటం లేదు.
# విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమా టైములో విజయ్ స్మోక్ చేసేవాడట. కానీ ఆ తర్వాత ఆ అలవాటుకు దూరమయ్యాడు.
# పవన్ కళ్యాణ్
కేవలం ఖుషీ సినిమా టైములో పవన్ స్మోక్ చేశారు. తర్వాత మాత్రం ఎప్పుడూ దాని జోలికి పోలేదు.
# రానా దగ్గుబాటి
నేనే రాజు నేనే మంత్రి సినిమా టైం వరకు రానా స్మోక్ చేసేవాడట. కానీ ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పుకునే టైములో చాలా కష్టపడ్డాడు. డాక్టర్ సలహాతో అలవాటుకి దూరమైనట్టు తెలుస్తోంది.
# మమ్ముట్టి
ఈ స్టార్ హీరో కూడా మొదట్లో స్మోకింగ్ చేసేవాడు. కానీ ఏడేళ్ల క్రితం దానికి గుడ్ బై చెప్పారట.
# హృతిక్ రోషన్
మొదట ఇతనికి అలవాటు లేదు. కానీ కొంతకాలం తర్వాత కొద్దిగా అలవాటు అయ్యింది. అయితే వెంటనే రియలైజ్ అయ్యి దానికి స్వస్తి చెప్పాడు.
# సల్మాన్ ఖాన్
మన కండల వీరుడు కూడా గతంలో చైన్ స్మోకర్ కానీ తర్వాత స్మోకింగ్ వల్ల ఇతని ఆరోగ్యం దెబ్బతింది. తర్వాత డాక్టర్ల సలహాలతో ఆ అలవాటుకు దూరం అయ్యాడు.
# ఆమీర్ ఖాన్
తన పిల్లల రిక్వెస్ట్ మేరకు స్మోకింగ్ హ్యాబిట్ ను విడిచిపెట్టి మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.
READ ALSO : ఆడవాళ్లు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో మీకు తెలుసా..?