Advertisement
చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడతారు. గ్యాస్ట్రిక్ సమస్య వలన చాలా మందికి ఛాతి నొప్పి కలిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న ఛాతి నొప్పిని కూడా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. కొన్ని సార్లు అది గుండెపోటుకు కారణం అవ్వచ్చు. శ్వాస సమస్యలు ఉన్నట్లయితే గుండె సంబంధిత వ్యాధికి సంకేతం అవ్వచ్చు. ఈ సమస్య ఉంటే తరచుగా వైద్యుని సలహా తీసుకోవాలి. శరీరంలో కనపడే కొన్ని రక్షణాలు ఊపిరితిత్తుల సమస్యలను సూచిస్తాయి. ఒకవేళ తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు వంటి సమస్యలు వస్తే ఊపిరితిత్తుల సమస్యకి కారణం అని అర్థం చేసుకోవాలి.
Advertisement
Advertisement
శ్వాస తీసుకునేటప్పుడు సమస్య ఉన్నట్లయితే ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొర వాపుకి గురైందని అర్థం చేసుకోవాలి. శ్వాస సంబంధిత సమస్య ఉన్నట్లయితే ఛాతిలో నొప్పి, దగ్గు వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. కొంతమంది మెట్లు ఎక్కేటప్పుడు ఆవేశ పడుతూ ఉంటారు. ఊపిరాడనట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఊపిరితిత్తులు ఏదైనా సమస్య ఉందేమో చేయించుకోవాలి.
Also read:
హైపర్ టెన్షన్, ఆస్తమా కారణంగా ఇది రావొచ్చు. వ్యాయామం, డైటింగ్ చేయకుండా బరువు తగ్గుతున్నట్లయితే సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సమస్య ఉన్నట్లయితే ఛాతిలో నొప్పి వంటి మార్పులు వస్తాయి ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా కూడా ఛాతిలో నొప్పి కలుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!