Advertisement
హిందూ దేవుళ్ళలో ఒకరు ఆంజనేయస్వామి. ఆయన శ్రీరాముల వారి కోసం అనేక త్యాగాలు చేసిన గొప్ప భక్తుడు. ముఖ్యంగా ఓ ధీరుడు అని చెప్పుకోవాలి. అయితే ఈ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు. అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం ఎందుకు. పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మ! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు.
Advertisement
ఇలా ఆకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మ తల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని చెప్పింది. ఇక అంతే, దీనిలో శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అన్న పదం హనుమంతుడికి బాగా నాటుకు పోయింది. మరునాడు ఆంజనేయస్వామి తన శరీరమంతా సింధూరం రాసుకొని సభకు వెళ్ళాడు. సభలో శ్రీరాముడు ఆంజనేయస్వామిని పిలిచి ఏమిటి ఇలా ఒళ్లంతా సింధూరం రాసుకున్నావు అని అడగగా సీతమ్మ తల్లి చెప్పిన జవాబు చెప్పాడు. అంతే రాముడు ఆంజనేయస్వామి భక్తికి పరవశుడయ్యాడు. వెంటనే ఒక వరం ఇచ్చాడు.
Advertisement
ఎవరైతే మంగళవారం నాడు హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారో, సింధూరం వేయిస్తారో వారి అభిష్టాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగి పనులు పూర్తవుతాయి. అనే వరాన్ని శ్రీరాములు ఇచ్చాడు. ఆనాటి నుంచి నేటి వరకు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మనోభీష్టాలు తీర్చుకోవడానికి సింధూరం ధారణ చేయించడం జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకు మీ సమస్యల పరిష్కారానికి హనుమంతుడికి భక్తితో, శ్రద్ధతో సింధూర ధారణ చేయించండి. నిత్యం సింధూర ధారణతో స్వామి కృపకు పాత్రులు కండి.
Read also: టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా, ఎంతో తెలిస్తే అవాక్కే !