Advertisement
ఈరోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అంతా సోషల్ మీడియా నడిపిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు కూడా. ఒక్కొక్కసారి ఒకరిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. విపరీతంగా మీమ్స్ కూడా వేస్తూ ఉంటారు. వీటి వలన ప్లస్ లు ఉన్నాయి అలానే మైనస్లు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్స్ అయ్యి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీలు దాకా ఎంతోమంది ట్రోల్స్ కారణంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనం రెగ్యులర్ గా చూస్తున్నాం.
Advertisement
కొంతమంది అయితే ఏకంగా ప్రాణాన్ని తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో టీడీపీ జనసేన ట్రోలింగ్స్ కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైయస్సార్సీపి ప్రభుత్వం లో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన గీతాంజలి అనే ఒక మహిళ కి ఇంటి పట్టా వచ్చింది. ఇంటి పట్టా తీసుకున్నాక వైయస్సార్సీపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు చాలాకాలం తర్వాత ఇల్లు కట్టుకోవడానికి జగన్ ఇంటి స్థలం ఇచ్చారని చెప్పి ఆనందాన్ని పంచుకుంది. తన పిల్లలకి అమ్మ ఒడి వస్తుందని సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయని ఆమె చెప్పి సంతోషపడ్డారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియా ద్వారా వేధింపులు మొదలుపెట్టారు.
Advertisement
విపరీతమైన ట్రోలింగ్ కారణంగా మానసిక వేదనకి గురైన గీతాంజలి ప్రాణాన్ని తీసుకున్నారు. ఈ విషయంపై ఇంట్లో కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు ఆమెని మందలిస్తూ వచ్చారు. దీంతో మనస్థాపానికి గురై ప్రాణాన్ని తీసుకుంది ఇద్దరు ఆడపిల్లలు తన తల్లి ప్రేమకి దూరమయ్యారు. గతంలో కూడా బెండపూడి ప్రభుత్వ పాఠశాల పిల్లలపై తీవ్రంగా ట్రోల్స్ చేశారు. ఆ విద్యార్థులు ఎంతో మానసిక క్షోభ కి గురయ్యారు. ఏదేమైనా ఇటువంటివి జరగకూడదు లేదంటే చాలామంది అనవసరంగా అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. ఎటువంటి ట్రోల్స్ వేసే వారిని పోలీస్ శాఖ సుమోటోగా కేస్ తీసుకుని దర్యాప్తు చేపట్టి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!