Advertisement
ప్రేమ రెండక్షరాల ఈ పదం వెనుక అనేక చరిత్రలున్నాయి. ఎన్నో ప్రాణాలు పోయాయి.. ఎన్నో ప్రాణాలు నిలిచాయి. ఎన్నో జీవితాలు ఆగిపోయాయి ఇంకెన్నో జీవితాలు మరొకరికి భరోసాను ఇచ్చాయి.. ఈ ఒక్క పదమే ఇన్నింటికి మూలస్తంభం. ఈ మత్తులో పడితే దేనికైనా తెగిస్తారు. ఎంతవరకైనా పోతారు.. ప్రేమిస్తే బాగానే ఉంటుంది కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు.. లవ్ పేరుతో పెళ్లిళ్లు చేసుకొని మూన్నాళ్లయినా కాకముందే బంధాలను తెంచుకుంటూ ఉన్నారు..
Advertisement
also read: మణిరత్నం “పొన్నియన్ సెల్వన్” చూసాక మీకు ఇదే డౌట్ వచ్చిందా ? ఇది నిజమే నా అస్సలు నమ్మలేరు !
Advertisement
కర్కశంగా వ్యవహరిస్తూన్నారు.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ముందు ప్రేమించాడు.. పెద్దలకు కులం అడ్డు వచ్చింది.. వాళ్ళ మాటలు కాదని బయట పెళ్లి చేసుకున్నారు.. ఏడాదిన్నర చక్కగా కాపురం చేశారు…. అప్పుడే ఆ భర్త బుద్ధి మారింది.. తల్లిదండ్రుల మాటలు పట్టుకొని అమ్మాయిని వేధించడం మొదలు పెట్టారు.. నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది ఈ ఘటన .. ఈ జిల్లాలోని ఇందల్వాయి మండల్ తిమ్మంపల్లి కి చెందిన మౌనిక అదే గ్రామానికి చెందిన శ్రావణ్ ప్రేమించుకున్నారు.
వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. అయితే గత సంవత్సరం జూన్ 3వ తేదీన పెద్దలను ఎదిరించి రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో కాపురం పెట్టారు.. పెళ్లయిన ఏడాదిన్నర తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో శ్రావణ్ తన తల్లిదండ్రుల మాట విని అమ్మాయిని వేధించడం మొదలు పెట్టారు.. దాంతో తట్టుకోలేక మౌనిక 4 నెలల క్రితం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీంతో ఈ ఘటన కాస్త బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:వేణుమాధవ్ 10 ఎకరాల భూమికి..పవన్ కళ్యాణ్ కు ఉన్న సంబంధంఏంటంటే ?