Advertisement
తెలుగు ఇండస్ట్రీ లోనే ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు పొందిన దేవి శ్రీ ప్రసాద్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ఆయన ప్రేమలో ఉన్నారని వివాహానికి కూడా సిద్ధమయ్యారని వార్తలు షికార్లు కొట్టాయి. వారి కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నారని,ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలోనే వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందట. అలా కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ దేవి శ్రీ ప్రసాద్ గురించి మరో లవ్ వార్త బయటకు వచ్చింది..
Advertisement
also read:భలే పిల్లి… మొత్తానికి నీటిలోని చేపను పట్టేశావుగా.. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..?
Advertisement
ఆయన హీరోయిన్ పూజిత పొన్నాడ తో ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.. ఇదంతా ఒక ఎత్తయితే ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో పూజిత పొన్నాడ మాట్లాడుతూ..నేను ఎవరితోనూ ప్రేమలో లేనని చెప్పే ప్రయత్నం చేసిన, మీడియాలో మాత్రం వీరి మధ్య వ్యవహారం నడుస్తోందని బలంగా వినిపిస్తోంది. త్వరలోనే వివాహం ద్వారా ఒక్కటి కూడా కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో అనే విషయం మనం ఇప్పుడు చూద్దాం.
రంగస్థలం మూవీలో పూజిత పొన్నాడ కీలకమైన పాత్రలో కనిపించింది. ఈ మూవీ సమయంలోనే పూజిత పొన్నాడ పై సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మనసు పడ్డారని, దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారిందని వార్తలు వస్తున్నాయి.. అయితే పూజిత పొన్నాడ హీరోయిన్ గా పేరు తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ ప్రేమ విషయం బయటకు రావడంతో కాస్త ఇబ్బంది పడ్డట్టుగా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో,ఎంత అబద్దమో ఉందో తెలియదు కానీ, అసలు విషయం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..
also read: కాకి ఈ విధంగా అరిస్తే మీరు తప్పకుండా ధనవంతులవుతారు.. ఎలాగో చూడండి..?