Advertisement
Love Guru Review: లవ్ గురు మూవీ లో విజయ్ ఆంటోని, మృణాళిని రవి, యోగిబాబు, శ్రీజ రవి తదితరులు నటించారు. భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ కి వినాయక్ వైద్యనాధన్ ఈ సినిమా కి దర్శకత్వం వహించగా, మీరా విజయ్ ఆంటోని, విజయ్ ఆంటోని, సంద్ర జాన్సన్, నవీన్ కుమార్ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Advertisement
సినిమా: లవ్ గురు
నటీనటులు: విజయ్ ఆంటోని, మృణాళిని రవి, యోగిబాబు, శ్రీజ రవి తదితరులు.
దర్శకత్వం: వినాయక్ వైద్యనాధన్
నిర్మాత: మీరా విజయ్ ఆంటోని, విజయ్ ఆంటోని, సంద్ర జాన్సన్, నవీన్ కుమార్
సంగీతం: భరత్ ధన శేఖర్
రిలీజ్ డేట్: 11-04-2024
కథ మరియు వివరణ:
స్టోరీ విషయానికి వచ్చేస్తే, అరవింద్ (విజయ్ అంటోనీ) మలేషియాలో కేఫ్ నడుపుతాడు. చెల్లి తాలూకు చేదుగతం వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి బయట పడే క్రమంలో ఇబ్బంది వస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. ముప్పై దాటిపోతాయి అయినా పెళ్లి కాదు. సింగిల్ గానే ఉంటాడు. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలని మలేషియా నుండి ఇండియాకి వస్తాడు. అయితే ఇక్కడఅరవింద్ అనుకోకుండా చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీలా (మృణాళిని) ని చూస్తాడు. లవ్ లో పడతాడు. అతని తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రి తో పెళ్లి సంబంధం మాట్లాడుతారు. లీలాకి పెళ్లి ఇష్టం లేదు. సినిమా హీరోయిన్ అవ్వాలని అనుకుంటుంది.
Also read:
Advertisement
నటిగా మారడాన్ని అంగీకరించడం తో వివాహం జరిపిస్తాడు. అయితే పెళ్లయిన మరుసటి రోజు లీలాకి ఇష్టం లేని పెళ్లి చేశారన్న విషయం అరవింద్ కి తెలుస్తుంది. అతని ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ తరువాత ఏమైంది..? అరవింద్ తన భార్య మనసుని గెలుచుకోవడానికి ఏం చేస్తాడు..? అతన్ని వెంటాడుతున్న చెల్లి తాలూకా చేదు గతం ఏమిటి..? లీలా లక్ష్యం నెరవేరుతుందా..? తెలియాలంటే సినిమా చూడాలి. స్టోరీ బావుంది. స్టోరీ కి చెల్లి సెంటిమెంట్ ని జోడించి కొంచెం ఎమోషనల్ గా తెరమీదకి తీసుకొచ్చారు. రొటీన్ డ్రామా తో సినిమాని మొదలు పెట్టారు. అరవింద్ లీల కి మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్ గా వున్నాయి. లీలాగా హీరోయిన్ తెరమీద బాగా కనపడింది. విజయ్ మామయ్యగా నటించిన వీటీవీ గణేష్ నవ్వించే ప్రయత్నం చేశారు. మూవీ బోర్ కొట్టదు.
Also read:
ప్లస్ పాయింట్స్:
నటీ నటులు
పతాక సన్నివేశాలు
కథ
మైనస్ పాయింట్స్:
ఊహలకి తగ్గట్టుగా కథ
పాటలు
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!