Advertisement
దర్శకులు సినిమాని ఎంతో అందంగా తెరమీదకి తీసుకువస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు విఫలం అవుతారు. కొన్ని కొన్ని సార్లు సక్సెస్ అవుతారు. సినిమాలకి రకరకాల స్టోరీలు ఉంటూ ఉంటాయి. ప్రేమ కథలు లేదంటే మిస్టరీ ఇలా.. అయితే ప్రేమ కథలను ఇప్పటికే చాలామంది దర్శకులు తెరమీదకి తీసుకువచ్చారు. ప్రేమ కథలతో గుండెని బద్దలు కొట్టిన సినిమాలు వివరాలను ఇప్పుడు చూద్దాం.
Advertisement
7/g బృందావన్ కాలనీ:
ఈ సినిమా పేరు చెప్పగానే చాలామంది మనసు బరువు అయిపోతుంది. ప్రేమ కథని తీసుకువచ్చారు దర్శకుడు. నిజానికి ఇలాంటి సినిమా తీయాలంటే జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉండాలి.
ప్రేమిస్తే:
ప్రేమిస్తే కూడా ఒక ప్రేమ కథ అయితే ఈ సినిమా కూడా వెరైటీగా తీశారు. ఈ సినిమా పేరు చెప్తే గుండె బద్దలైపోయినట్లుగా ఉంటుంది.
ఓయ్:
ఇది చాలా అందంగా తీశారు కానీ ఆఖరిన గుండె బద్దలై పోతుంది ఈ సినిమా చూశాక ప్రపంచం మీద అలానే దేవుడి మీద కూడా కోపం వచ్చేస్తుంటుంది. సిద్ధార్ధ్, షాలినీ ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో నటించారు.
సుస్వాగతం:
Advertisement
పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమా కూడా కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాని కూడా దర్శకుడు ఎంతో అద్భుతంగా తీసుకువచ్చారు.
అభినందన:
ఇప్పటికి కూడా లవ్ ఫెయిల్యూర్ పాటలు అంటే అభినందన సినిమా గుర్తొస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళు ఈ సినిమా చూసి ఉండరు. అప్పట్లో ఆ సినిమా పాటలని ప్రేమ విఫలమైన వాళ్ళు పెట్టుకుని వినేవారు.
ప్రేయసి రావే:
శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా గుండె బద్దలైపోయేలా ఉంటుంది. ఇప్పుడు బేబీ లానే అనిపిస్తుంది.
బేబీ:
దర్శకుడు తన జీవితంలో అనుభవించిన బాధనంతటిని స్క్రీన్ మీద పెట్టేసాడు ఏమో అని అనిపిస్తుంది. ఈ ప్రేమ కథను చూస్తే కూడా కళ్ళంట నీళ్లు ఆగవు.
Also read: