Advertisement
మనోజ్,మమత క్లాస్ మేట్స్. స్నేహితులుగా ఉన్న వారి మధ్య ప్రేమ చిగురించింది.. ఇద్దరూ ఇంజనీరింగ్ చేశారు. ఇద్దరికీ మంచి జాబ్స్ వచ్చాయి.. కానీ వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడుతున్నారు.. మనోజ్ నాన్న మూర్తి చాలా ఖచ్చితమైన మనిషి.. పూటగడవని పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చి చాలా సంపాదించారు. వారి గల్లీలో ఆయనకు మంచి పేరుంది.. మనోజ్ కి తండ్రి అంటే చాలా భయం. తండ్రి ముందు ఈ మాట చెప్పడానికి భయపడుతున్నాడు.. ఈ తరుణంలోనే మమత ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. ఇంతలో మనోజ్ ఫోన్ మోగింది.. “అరేయ్ మను ప్లీజ్ రా మీ డాడీ తో మాట్లాడు”.. ఇంట్లో ఫోర్స్ ఎక్కువైపోయింది.. అంటూనే ఫోన్ కట్ చేసింది మమతా.. దీంతో మనోజ్ ఎలాగైనా డాడీ వద్దకు వెళ్లి మేటర్ చెప్పాలని భావించాడు.. దగ్గరికి వెళ్లి డాడీ అన్నాడు.. ఆ చెప్పురా అంటూ తండ్రి మూర్తి మనోజ్ వైపు చూశాడు..
Advertisement
also read: గరికపాటి వ్యాఖ్యలపై మొదటి సారి స్పందించిన చిరు ! అయన ఒక…. అంటూ !
Advertisement
దీంతో మనోజ్ ఏం లేదు డాడీ.. ఎక్కడికి రెడీ అవుతున్నారు అని అడిగాడు.. దీంతో మూర్తి మా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ అంతా కలిసి సిటీ ఔట్ స్కట్స్ వెళ్తున్నాం రా.. సాయంత్రం వచ్చేస్తాము అన్నాడు.. ఇంతలోనే మూర్తి ఫ్రెండ్స్ వచ్చి ఇంటి బయట హారన్ మోగించారు.. దీంతో అరెయ్ మనోజ్ ఈ రోజు ఆదివారం కదా నీ బైక్ ఇవ్వు.. నీకు ఏదైనా అవసరం ఉంటే నా కార్ వాడుకో అంటూ బైక్ తీసుకొని వెళ్ళాడు మూర్తి.. దీంతో ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకరి తర్వాత ఒకరు లైన్లో బైకు నడుపుతున్నారు.. ఇంతలో ఉప్పల్ క్రాస్ రోడ్డు వచ్చింది.. ట్రాఫిక్ పోలీసులు బైక్స్ చెక్ చేస్తున్నారు.. ఇందులో మూర్తి బండి పై కొన్ని చలాన్స్ ఉన్నాయి. మిగతా అందరికీ కరెక్ట్ గానే ఉన్నాయి.. దీంతో పోలీసులు మూర్తిని పట్టుకున్నారు.. ఏంటండీ నా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. లైసెన్స్ కూడా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారని గొడవకు దిగాడు.. లేదండి మీ బైక్ మీద మూడు చలాన్లు చూపిస్తున్నాయి అవి కట్టలేదు అంటూ పోలీస్ అధికారులు చూపించారు. ఆ చలాన్లకు సంబంధించిన వివరాలను పోలీసులు సిస్టంలో చూపిస్తూ, ఒకటి నెక్లెస్ రోడ్ వద్ద రాంగ్ పార్కింగ్ అయిన ఫోటో, రెండవది హైటెక్ సిటీ వద్ద సిగ్నల్ జంపు, మూడోది కోటి దగ్గర రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఈ ఫొటోలు చూపించారు అధికారులు..
ఈ మూడు ఫోటోల్లో మనోజ్ తో ఉన్నది ఒక అమ్మాయి.. ఒకటీ నో పార్కింగ్ దగ్గర బైకు ఆపుకొని ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్న ఫోటో, రెండవది అదే అమ్మాయి వెనక గట్టిగా హత్తుకొని కూర్చుని సిగ్నల్ జంప్, మూడవది అదే అమ్మాయి వెనక కూర్చొని ఇంకా గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఫోటో.. ఈ మూడింటిలో ఒక అమ్మాయి ఉంది.. దీంతో ఆ ఫోటోలు చూసిన ఫ్రెండ్స్ అరే అమ్మాయి బాగుంది.. ఈడు జోడు కలిసిందిరా మూర్తి అన్నారు.. ఒరేయ్ మా వాడు ఇంత ముదురు అనుకోలేదు అంటూ వారితో నవ్వుతూ అన్నాడు మూర్తి. ఇంటికి వెళ్లగానే కొడుకుని పిలిచి ఆరా తీశాడు. విషయం తెలుసుకుని మ్యారేజ్ ఓకే చేశారు.. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది.. ఇంతలో మ్యారేజ్ కూడా అయిపోయింది. సరిగ్గా వారం తర్వాత మనోజ్ మమత ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్లి పోలీసు చేతిలో పెట్టి ఆశీర్వదించమని కోరారు..
also read:వీరప్పన్ కూతుర్ని మీరు ఎప్పుడైనా చూసారా.. ఇప్పుడు ఆమె పెద్ద లీడర్..!!