Advertisement
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త రిలీఫ్ కలిగినా మళ్లీ మరో అల్పపీడనం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఏఏ జిల్లాలకు ఏ అలెర్ట్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం సెప్టెంబర్ ఐదున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం వల్ల ఏపీలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో ఒక గంట పాటు భారీ వర్షాలు కురుస్తాయి.
Advertisement
తర్వాత మోస్తరుగా వర్షాలు కురుస్తాయి. ఈరోజు రాయలసీమలో మాత్రం వర్షాలు లేవు అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లు గా ఉందట. ఏపీలో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తెలంగాణకు భారీ వర్ష సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
Advertisement
Also read:
Also read:
ఈ రోజు తెలంగాణ అంతటా ఓ మోస్తారుగా కురుస్తాయట. ఉత్తర తెలంగాణలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ చేశారు. మంగళవారం రాత్రి నుంచి తెలంగాణలో వాన పడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!