Advertisement
ఈ ఏడాది అక్టోబర్ 28 వ తేదీ అర్ధరాత్రి సమయంలో 11:30 గంటలకు చంద్రగ్రహణం రాబోతోంది. ఈ గ్రహణం వివిధ రాశిచక్రాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశం అంతటా చంద్రగ్రహణం వీస్తున్నందున, రాత్రి 11:30 గంటలకు, గ్రహణ ప్రభావం సుమారు గంట 16 నిమిషాల పాటు కొనసాగుతుంది. గ్రహణ స్పర్శ కాలము రాత్రి గం. 01-05 ని.లకు ఏర్పడుతోంది. నిమీలన కాలము 4 00.01-24 నిమిషములు కాగా, మధ్య కాలము 00.01- 44 నిమిషములు గా ఉంది.
Advertisement
ఇక మోక్షకాలము రాత్రి గం. 02 -22 ని.లుగా ఉంది. ఆద్యంత పుణ్యకాలము రా.గం. 01-37 నిమిషాలుగా ఉంది. రాత్రి సమయంలో ఈ గ్రహణం సంభవిస్తోంది కాబట్టి సాయంత్రం నాలుగున్నర గంటలకే భోజనాది కార్యక్రమాలను ముగించుకోవాలి. రాత్రి భోజనం పనికిరాదు. ఈ గ్రహణం అశ్వినీ నక్షత్రము మేశారాశిలో వస్తోంది కాబట్టి మేష, కర్కాటక, సింహ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ మూడు రాశుల వారు గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది.
Advertisement
ఖగోళంలో సంభవించే గ్రహాల కదలికలు, మార్పులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై ఈ గ్రహణాలు నెగటివ్ ఎనర్జీని చూపిస్తాయి. అందుకే గర్భిణీలు గ్రహణాన్ని చూడడం కానీ, గ్రహణ కాలంలో తినడం కానీ చేయకూడదని చెబుతుంటారు. ఇక్కడి కాలమానము ప్రకారం ఈ గ్రహణం అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతోంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆరోగ్యం బాగుండి, శారీరక శక్తీ కలిగిన వారు సాయంత్రం నాలుగు-నాలుగున్నర లోపలే భోజనాన్ని ముగించాలి. ఆ తరువాత తొమ్మిది వరకు ద్రవ పదార్ధాలను తీసుకోవచ్చు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ గ్రస్తులు రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు ఘన పదార్ధాలు తీసుకోవచ్చు.
మరిన్ని..
Lingochha Movie Review : “లింగోచ్చా” మూవీ రివ్యూ
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా..?