Advertisement
Mad OTT: చిన్న సినిమాగా రూపొందిన మ్యాడ్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో అంచనాలను తారుమారు చేస్తూ స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఇంజినీరింగ్ కళాశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంది, విస్తృతమైన ప్రశంసలు మరియు పాజిటివ్ రెస్పాన్స్ లను సంపాదించింది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు అంతగా ఆకట్టుకోలేకపోయాయి, ఫలితంగా నిర్మాతలకు కొంత నష్టం వాటిల్లింది. అయితే..ఈ సినిమా తాజాగా ఓటిటి రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.
Advertisement
సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కూడా కీ రోల్ పోషించారు. ఈయన తెరపై బాగా కామెడీని పండించారు. అక్టోబర్ ఆరవ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కలెక్షన్ ను రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కోసం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
Advertisement
ఈ సినిమా అధికారిక ప్రకటనతో నవంబర్ మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ శంకర్ రచించి, దర్శకత్వం వహించిన ‘మ్యాడ్’ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్ మరియు ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నారు. కథలోకి వెళ్తే, ఈ సినిమా స్టోరీ మొత్తం ఇంజనీరింగ్ కాలేజీ చుట్టూ తిరుగుతుంది. ఒకే కాలేజీలో చేరిన సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ జీవితాల్లోకి అనంతిక, శ్రీ గౌరీ ప్రియారెడ్డి, గోపిక ఉద్యాన్ వస్తారు. ఈ అమ్మాయిల రాకతో అబ్బాయిల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? అన్నది వినోదాత్మకంగా చిత్రీకరించారు. హాయిగా చూసి, కడుపుబ్బా నవ్వుకునే సినిమా ఇది.. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయ్యితే ఓటిటిలో చూడడానికి వెయిట్ చేయండి.