Advertisement
అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తీసిన చిత్రం మహానటి.. ఈ సినిమా చూస్తుంటే అప్పటి సావిత్రమ్మ ఏ విధంగా ఉండేది, ఆమె జీవితం ఎలా ముగిసింది అనేది కళ్ళకు కట్టినట్టు కీర్తిసురేష్ నటించి చూపించింది.. ఆమె నటన అభినయానికి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే.. అయితే ఈ సినిమా చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
1. ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నప్పుడు, లేదంటే బాధగా ఉన్నప్పుడు ప్రేమలో పడకూడదు అనేది మొదటి పాఠం.
2. సావిత్రి తన నట జీవితాన్ని మొదలుపెట్టడం తనకు కొత్త ప్రపంచాన్ని శివాజీగణేషన్ పరిచయం చేయడం ఇంతలోనే అతనితో ప్రేమలో పడటం ఒకేసారి జరుగుతాయి..
3. ముఖ్యంగా భార్య పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని సావిత్రి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది..
also read: కమల్ హాసన్ నుంచి ప్రభాస్ : 2022లో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 10 హీరోలు !
4. ఒకవేళ వివాహం బలవంతంగా జరిగింది అనుకుందాం.. ముఖ్యంగా వివాహం చేసుకునే ముందు అతనికి పిల్లలు ఉన్నారా లేదా అనే చెక్ చేసుకోండి.. పెళ్లయితే బలవంతంగా చేయగలరు కానీ, వారికి పిల్లలు పుట్టడం అనేది వారి ప్రమేయం తోనే జరుగుతుంది అనేది ఆలోచించండి..
Advertisement
5. ఒకరు బాధపడుతుంటే మనం ఆనందించడం అసాధ్యం.. సావిత్రి వల్ల జెమినీ గణేషన్ మొదటి భార్య బాధ పడుతుంది అనేది నిజం.
6. అంతే కాకుండా డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా సరే ఉచితంగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే చులకన అయిపోతాం.. అలా చేస్తే మన పతనానికి మనమే దారులను వెతుక్కునట్టు అనేది మహానటి సినిమా చూస్తే అర్థం చేసుకోవచ్చు.
7. మరీ ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు గానీ సంతోషంలో ఉన్నప్పుడు గానీ మద్యానికి అలవాటు కావద్దు.. అలా అయితే ఈ రెండింటిలో మనకి ఏ ఫీలింగ్ వచ్చిన ముందు గుర్తుకు వచ్చేది మందే.. దీనివల్ల బానిస అయ్యే అవకాశం ఉన్నదని గుర్తుంచుకోండి.
8. ముఖ్యంగా డబ్బు ఉన్న వారు అందరూ చెడ్డవారు కాదు. పేద వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. అనేది సావిత్రి దగ్గర పని చేసే పని వాడిని చూస్తే అర్థం చేసుకోవచ్చు.
9. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనేది, సావిత్రి జీవితాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. జెమినీ గణేషన్ లైఫ్ లోకి ప్రవేశించి అతని మొదటి భార్య గురించి ఏమాత్రం ఆలోచించకుండా అతని పెళ్లి చేసుకుంది సావిత్రి. అదే జెమినీ గణేషన్ మరో మహిళతో ఉండగా కళ్లారా చూసిన సావిత్రి తన ప్రేమను చంపుకోలేక,గణేషన్ కు దగ్గర అవ్వలేక చివరకు డిప్రెషన్ కు వెళ్లి మందుకు బానిసై తన జీవితానికి తానే పాడు చేసుకుంది..
also read: