Advertisement
అలనాటి మేటి నటి మహానటి సావిత్రి అంటే తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కున్నారు. తన అందం అభినయంతోనే కాకుండా తన కళ్ళతోనే అన్ని హావాభావాలు పలికించే టాలెంట్ ఆమె సొంతం. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సావిత్రిని చివరికి నా అన్న వాళ్లే నమ్మించి మోసం చేశారు. అంతేకాకుండా ఆమెకున్న దాన గుణం వల్ల ఉన్నదంతా దానధర్మాలు చేసి చివరికి దారుణమైన పరిస్థితి అనుభవించింది. చివరి రోజుల్లో దిక్కుతోచని స్థితిలో కన్ను మూసింది. అప్పట్లో సావిత్రికి చాలామంది సన్నిహితులు ఉండేవారట. దివంగత గుమ్మడి కూడా సావిత్రికి సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది. ఆయన చివరి రోజుల్లో ఒక ఇంటర్వ్యూలో సావిత్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..
Advertisement
నేను సావిత్రి కి చాలా ఆత్మీయుడిని, నన్ను అన్నా అంటూ పిలిచేది కానీ ఆమె చివరి రోజుల్లో పడిన కష్టాలు నా కళ్ళతో చూశాను. అందులో తీపి, చేదు రెండు ఉన్నాయి. ఓ రోజు నేను అనారోగ్యం బారిన పడిన సమయంలో మంచంపై లేవలేని స్థితిలో ఉన్నాను. ఆ టైంలోనే సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. నా దిండు కింద 2,000 రూపాయలను పెట్టింది. కానీ నేను చూసుకోలేదు.. ఆ తర్వాత చూసి సావిత్రి కి ఫోన్ చేశాను, ఇలా చేసావ్ ఏంటమ్మా అని అడగ్గా నేను చనిపోయే లోపు ఎవరికీ బాకీ ఉండకూడదని సావిత్రి చెప్పుకొచ్చిందట.. ఆ టైంలో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.. అంతేకాకుండా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో సావిత్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది.
Advertisement
also read: బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది, మేక లాగా పుట్టిన కుక్కపిల్ల!
నేను నటిస్తున్న ఒక సినిమాలో తల్లి పాత్రలో కూడా నటించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమా షూటింగ్ టైంలో మధ్యాహ్నం అందరికీ ఇంటి నుండి క్యారియర్లు వచ్చేవి. రానివారికి ప్రొడక్షన్ వారు భోజనం పెట్టేవారు. కానీ సావిత్రికి క్యారియర్ వచ్చేది కాదు. ప్రొడక్షన్ వాళ్లు కూడా భోజనం పెట్టలేదు. ఓ దగ్గర ఖాళీగా కూర్చున్న సావిత్రిని నేను భోజనం చేయలేదా అని అడిగితే.. లేదన్నా అంటూ చెప్పింది.. దాంతో కలిసి తిందామని పిలిచాను కానీ మొదట రానంది, నువ్వు రాకుంటే నేను కూడా భోజనం చేయను అని చెప్పేసాను.. దీంతో ఏడ్చుకుంటూ వచ్చి నాతో భోజనం చేసింది.. ఒకప్పుడు సావిత్రి డేట్స్ కోసం ఎదురుచూసిన వాళ్ళు ఉన్నారు, కానీ చివరి రోజుల్లో మాత్రం ప్రొడక్షన్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అంటూ సావిత్రికి జరిగిన అవమానాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:కమలానికి గుచ్చుకున్న గులాబీ ముల్లు