Advertisement
విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా తదితరులు ఈ సినిమాలో నటించారు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. సుదన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. B అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
Advertisement
నటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా తదితరులు
దర్శకుడు: నితిలన్ స్వామినాథన్
నిర్మాత: సుదన్ సుందరం, జగదీష్ పళనిసామి
సంగీతం: B అజనీష్ లోకనాథ్
రిలీజ్ డేట్: 14-06-2024
కథ మరియు వివరణ:
మహారాజా (విజయ్ సేతుపతి) భార్య చనిపోతుంది. కూతురు జ్యోతితో కలిసి ఒక సెలూన్ షాప్ నడుపుకుంటూ బతుకుతాడు. చిన్నప్పుడు ఆక్సిడెంట్ లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్త బుట్ట మాత్రం కూతురు ప్రాణాలను కాపాడుతుంది. దానికి లక్ష్మీ అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కూతురు స్పోర్ట్స్ క్యాంప్‌లో పాల్గొనడానికి వెళ్ళాక మహారాజా చెత్తబుట్ట పోయిందని… ఆమె వచ్చేలోపు ఆ చెత్తబుట్ట దొరికి పెట్టమని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు చెత్తబుట్ట పోవడం ఏంటని పోలీసులు తిట్టినా దొరికేదాకా అక్కడే ఉంటానని కావాలంటే డబ్బులు ఇస్తానని అంటాడు. దీంతో పోలీసులు అలాంటిదే ఒక డూప్లికేట్ చెత్తబుట్ట కోసం ట్రై చేస్తారు.
ఇంకో పక్క సెల్వం (అనురాగ్ కశ్యప్) తన స్నేహితుడితో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు సెల్వంకు మహారాజకు సంబంధం ఏంటి..? చెత్తబుట్ట దొరికిందా పోలీసులు ఏం చేస్తారు..? స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్ళాక కూతురు తిరిగి వచ్చిందా అనేది తెలియాలంటే మూవీ చూడాలి. మొదటి పార్ట్ అంతా మహారాజా గురించి, అతని చట్టం చెత్తబుట్ట కథ గురించి చూపిస్తూ కొంచెం కామెడీని పండించారు. ఇంకో పక్క సెల్వం దొంగతనాలను చూపించారు ఇంటర్వెల్ కి ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అయితే స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవడంతో సెకండ్ హాఫ్ మొదట్లోనే కథ అర్థమైంది ట్విస్టులు రివిల్ చేస్తూ వస్తుండడంతో సెకండ్ హాఫ్ మధ్యలోకి వచ్చేసరికి క్లైమాక్స్ కూడా అందరికీ అర్థం అయిపోయింది. స్క్రీన్ ప్లే బాగుంది అనిపించినా కథ మామూలుగానే అనిపిస్తుంది చివర్లో ఎమోషన్ బాగుంది.
Advertisement
Also read;
విజయ్ సేతుపతి నటన గురించి అందరికీ తెలుసు. 50వ సినిమాగా ఇలాంటి మామూలు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం. ఈ పాత్రలో అద్భుతంగా నటించారు విజయ్ సేతుపతి. తమిళ యువ హీరోయిన్ దివ్యభారతి గెస్ట్ రోల్ లో కనపడ్డారు. సెల్వంగా అనురాగ్ కశ్యప్ ఇంకో సారి విలనిజాన్ని పండించారు. సెల్వం భార్య పాత్రలో అభిరామి మెప్పించారు. తమిళ డబ్బింగ్ సినిమా కావడంతో అందరూ తమిళ నటులే ఉన్నారు మిగిలిన నటులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. స్క్రీన్ ప్లే చాలా ప్లస్ అయింది సరికొత్త స్క్రీన్ ప్లే తో అద్భుతంగా రాశారు సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నిర్మాణపరంగా కూడా సినిమాకి బానే ఖర్చు పెట్టారు. మొత్తంగా మహారాజు సినిమా సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని మెప్పించింది.
Also read:
ప్లస్ పాయింట్స్:
విజయ్ సేతుపతి నటన
ఎమోషన్స్
కథ
మైనస్ పాయింట్స్:
సాగుతీత సన్నివేశాలు
ముందే అర్థమైన ట్విస్టులు
రేటింగ్: 3/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!