Advertisement
చాలా మంది హీరోయిన్లు, హీరోలు ఇండస్ట్రీ లో వున్నారు. అయితే ఏ సినిమా లో నటించాలన్నా కూడా పక్కా మేకప్ వేసుకోవాలి. మేకప్ లేకుండా నటించాలంటే రిస్క్ ఏ. అందుకు అందరూ ఒప్పుకోరు కూడా. కానీ కొంత మంది మాత్రం మేకప్ లేకుండా సినిమాల్లో నటించారు. అలా మేకప్ లేకుండా నటించిన హీరోలు, హీరోయిన్స్ కొందరు వున్నారు. ఉదాహరణకి సాయి పల్లవి. ఫిదా సినిమాలో మేకప్ లేకుండా నటించింది ఈ భామ. మేకప్ లేకుండా నాచురల్ గా నటించి సాయి పల్లవి ఆకట్టుకుంది.
Advertisement
Advertisement
అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మేకప్ లేకుండా ఏ సినిమాలో నటించారు. మహేష్ బాబు తన కెరీర్ మొత్తంలో మేకప్ ఏ వేసుకోకుండా ఓ మూవీ లో నటించాడు అదే తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమా. టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ఈ మూవీలో విలన్ గా నటించాడు. తాళ్ళూరి రామేశ్వరి, రంగనాథ్ మొదలైన వాళ్ళు కీలక పాత్రలను పోషించారు. చిత్రం మూవీస్ బ్యానర్ పై తేజ ఈ సినిమాను నిర్మించారు. 2003లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు మహేష్.
Also read: