Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సితార తండ్రికి తగ్గ కూతురుగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా సితారకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ సార్ మహేష్ బాబు కూతురు సితార తండ్రి లాగే గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. పైగా మహేష్ బాబు కూడా తన పిల్లలని తనలాగే గొప్పగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు.
Advertisement
మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికే ఒక కమర్షియల్ యాడ్ లో నటించి, తానేంటో ప్రూవ్ చేసుకుంది. రెమ్యునరేషన్ లో తండ్రికి పోటీగా నిలబడుతోంది. కేవలం ఈ ఒక్క విషయంలో కాకుండా మానవత్వాన్ని చాటుకోవడంలో కూడా సితార తన తండ్రి తో పోటీపడుతోంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే ఈ యాడ్ కోసం తీసుకున్న మొదటి పారితోషకాన్ని మీరు ఏం చేశారు..?
Advertisement
మీ అమ్మకి ఇచ్చారా నాన్నకి ఇచ్చారా లేదంటే ఈ డబ్బుని మీరే ఖర్చు పెట్టుకున్నారా అన్న ప్రశ్న కి.. ఆ డబ్బులని ఛారిటీ కి ఇచ్చానని అంది. ఇది విన్న నెటిజన్లు ఆమె మీద ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ కూతురు సితార అని కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు కూడా అడ్వర్టైజ్మెంట్లకి వచ్చిన డబ్బులని ఛారిటీల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు.
అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మహేష్ బాబుకు వచ్చిన డబ్బులని చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఖర్చు చేస్తుంటారు. గతంలో కూడా మహేష్ బాబు ఎందరికో సహాయం చేశారని మనం విన్నాం. తండ్రి బాటలోనే కూతురు సితార కూడా అడుగులు వేస్తోంది. మొదటి పారితోషకం కోటి రూపాయలని ఛారిటీకి ఇచ్చి పెద్ద మనసుని చాటుకుంది.
Also read: