Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఘట్టమనేని కుటుంబానికి, వారి అభిమానులకు 2022 సంవత్సరం కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే మహేష్ బాబు అన్న రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది కాలం పాటు కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి విచమించడంతో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మరణించారు. ఈ ఘటనతో ఫ్యామిలీలో విషాదం నిండుకుంది. కాగా సరిగ్గా 10 నెలలు గడిచిన తర్వాత మహేష్ బాబు తల్లి, కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు.
Advertisement
Read also: సూపర్ స్టార్ నల్ల కళ్లద్దాల వెనుక అసలు స్టోరీ ఇదే !
Advertisement
దీంతో మహేష్ బాబు ఫ్యామిలీ షాక్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఇందిరా దేవి మరణించిన నెల రోజులకే సూపర్ స్టార్ కృష్ణ సైతం గుండెపోటుతో మరణించారు. ఇలా ఏకంగా మహేష్ బాబు కుటుంబంలో మూడు మరణాలు సంభవించాయి. ఇప్పుడు మహేష్ కి వచ్చిన కష్టాన్ని చూసి అంతా చలించిపోతున్నారు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ మరణం కారణంగా కుటుంబంలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది రమేష్ బాబు కుటుంబ సభ్యులేనని చెప్పుకోవాలి. ఒకే ఏడాదిలో తండ్రిని, నానమ్మని, తాతయ్యని కోల్పోయి రమేష్ బాబు బిడ్డలు పెద్దదిక్కుని కోల్పోయినట్టు అయింది. ఇక రమేష్ బాబు భార్య మృదుల కష్టాన్ని అయితే మాటల్లో వర్ణించడం కష్టం. ఇంతటి కష్ట సమయంలో మహేష్ తన అన్న కుటుంబానికి అండగా నిలిచినట్టు తెలుస్తోంది.
రమేష్ బాబు మృదులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు జయకృష్ణ విదేశాలలో ఉంటున్న కారణంగా తాతయ్య చివరి చూపుకు నోచుకోలేకపోయాడు. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత 17వ తేదీన జరిగిన చిన్న కర్మలో రమేష్ బాబు కొడుకు జయకృష్ణ, కూతురు భారతి, భార్య మృదుల పాల్గొని సూపర్ స్టార్ కృష్ణ కి నివాళులు అర్పించారు. ఈ సమయంలో మహేష్ బాబు వారి వెన్నంటే ఉండి ధైర్యం నింపుతూ కనిపించారు. వారితో కాసేపు మాట్లాడి ఓదార్చే ప్రయత్నం చేశారు. మహేష్ తన వదినకి ధైర్యంగా ఉండమని, అన్నింటికీ తాను ఉన్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్న ఇంటి బాధ్యతలను కూడా ఇప్పుడు మహేష్ బాబు తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.