Advertisement
ఒకప్పుడు తెలుగు హీరోలు తమిళ హీరోలు, మలయాళ హీరోలు అంటూ సపరేట్ సపరేట్ గా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ బౌండరీస్ క్లియర్ అయిపోయాయి. కేవలం సినిమా మాత్రమే మాట్లాడుతుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా సినిమాలు కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. అందుకే అందరూ హీరోలు అన్ని ఇండస్ట్రీలలో అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలు, తమిళం, హిందీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర భాషల హీరోలు తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా తెలుగులో నటించిన హీరోలు ఎవరు ఉన్నారో మీరు ఓ లుక్ వెయ్యండి.
Advertisement
దుల్కర్ సల్మాన్ పేరుకు మలయాళీ హీరో అయిన, తెలుగుతో పాటు, తమిళం, హిందీ అన్ని భాషల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు.
Advertisement
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో తాజాగా ‘సీతారామం’ మూవీతో పలకరించారు. ఫహాద్ ఫాజిల్ ఇప్పుడు తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అందులో పోలీస్ ఆఫీసర్ షేకావత్ పాత్రలో నటించారు.
మోహన్ లాల్ తెలుగులో తొలిసారి ప్రియదర్శన్ దర్శకత్వంలో బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా నటించిన ‘గాండీవం’ సినిమాలో ఓ పాటలో మెరిశారు. ఆ తర్వాత మనమంతా, జనతా గ్యారేజ్ వంటి డైరెక్ట్ తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు.
మమ్ముట్టి తెలుగులో ‘స్వాతికిరణం’ తోపాటు ‘సూర్యపుత్రులు’, ‘రైల్వే కూలి’ యాత్ర వంటి డైరెక్ట్ తెలుగు సినిమాలతో పలకరించిన మమ్ముట్టి త్వరలో అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీతో పలకరించబోతున్నారు. సురేష్ గోపి కూడా ‘అంతిమ తీర్పు’ తో పాటు ‘ఆ ఒక్కడు’ వంటి సినిమాలతో పలకరించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ‘పోలీస్ పోలీస్’ సినిమాతో పలకరించారు.
ALSO READ : “సింహరాశి” మూవీని బాలయ్య రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా..?