Advertisement
విక్టరీ వెంకటేష్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో మనకి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రాలలో మల్లీశ్వరి ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2004లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాశారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ అన్నయ్య కూతురు డాలీగా ఓ చిన్నారి నటించింది.
Advertisement
Read also: సుకుమార్ ఇంట్లో ఒక వైపు చిరు ఫోటో, మరి వైపు బాలకృష్ణ ఫోటో ఉంటాయి ఎందుకో తెలుసా ?
ఈ మూవీలో ఆమె ఉన్నది ఒకటే రెండు సన్నివేశాలలోనే అయినా.. మనకు గుర్తుండిపోయింది. ఆ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రి. పలు సినిమాలలో ఈ చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు ఈ చిన్నారి ఎలా ఉందో తెలుసా..? హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది. గ్రీష్మ మల్లీశ్వరి సినిమాలోనే కాకుండా.. సిద్ధార్థ్ చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అనుష్క నటించిన పంచాక్షరి, శర్వానంద్ నటించిన ప్రస్థానం ఇలా 30 చిత్రాలలో బాలనటిగా నటించింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బసవతారకం చిన్నప్పటి క్యారెక్టర్ లో కూడా నటించింది.
Advertisement
గ్రీష్మ 2000 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన హైదరాబాద్ లో జన్మించింది. ఈమెకి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు శ్రావ్య. లవ్ యూ బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రావ్య. అయితే బాలనటిగా ఓ వెలుగు వెలిగిన గ్రీష్మ స్టడీస్ కారణంగా ఇన్నాళ్లు సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది. అయితే గతేడాది హైదరాబాద్ లోని విఎన్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం పూర్తిస్థాయి నటిగా మారే ప్రయత్నాలలో ఉంది. ఇందులో భాగంగానే ఫోటోషూట్స్ చేస్తూ తనవంతుగా దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.