Advertisement
Mama Mascheendra OTT Release Date : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. హిట్ కోసం ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోలలో సుధీర్ బాబు ఒకరు. సుధీర్ బాబు నటించిన లాస్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా భారీగా నిరాశపరిచి డిజాస్టర్ గా నిలిచిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కొత్త సినిమాతో వచ్చాడు.
Advertisement
Mama Mascheendra OTT Release Date
‘మామా మశ్చీంద్ర’ అంటూ డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్షవర్ధన్, ఆలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్ తదితరులు ఇందులో కీలకపాత్రలో నటించారు. థ్రిల్లింగ్, ఎంగేజింగ్ స్టోరీలైన్ తో తెరకెక్కిన ‘మామా మశ్చీంద్ర’ ( Mama Mascheendra ) చిత్రాన్ని హర్షవర్ధన్ దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పి.జి. విందా సినిమాటోగ్రఫీ అందించారు.
Advertisement
మార్తాండ్ కే.వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. పరశురాం (సుధీర్ బాబు) జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో ‘మామా మశ్చీంద్ర’ ( Mama Mascheendra : ) సినిమా రూపొందింది. రివేంజ్ తో పాటు త్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా అంశాలు కలగలిసిన ‘మామా మశ్చీంద్ర’ చిత్రం అక్టోబర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులకు మరచిపోలేని సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది.