Advertisement
వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, అన్నయ్య చేసుకోవాల్సిన అమ్మాయిని మరో వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగిన ఆ యువకుడి కథను ఇప్పుడు చూద్దాం.
Advertisement
అమ్మ, నాన్న, అన్నయ్య, నేను ఇదే మా కుటుంబం. చిన్నప్పటి నుంచి అందరూ అన్నయ్యని ఎక్కువగా గారాబంగా చూసేవాళ్ళు. ఎందుకో నాకు తెలిసేది కాదు. కానీ నాకు అన్నయ్య అంటే ఎంతో ఇష్టం. వాడు నాకు ఎప్పుడు తోడుగా ఉండేవాడు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాను. ఓ రోజు మా అన్నయ్య కోసం ఒక సంబంధం వచ్చింది. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒకరోజు వాళ్ళు పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చారు. అన్ని మాట్లాడుకొని సంబంధం కుదుర్చుకొని వెళ్లారు. కానీ నాకు ఆ రోజు ముఖ్యమైన మీటింగ్ ఉండడంతో నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను.తర్వాత అన్నయ్య పెళ్లికి ఒక నెల రోజుల్లో ముహూర్తం పెట్టారు. అప్పటి నుంచి మా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైంది. బంధువుల రాక కూడా ప్రారంభమైంది.
Advertisement
మా నాన్న తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు పెళ్లి చేసేందుకు కొంత డబ్బును అప్పు చేసి మరి పెళ్లి పనులు మొదలు పెట్టారు. షాపింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఒక రోజు బయటకు వెళ్లిన అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. అప్పటికి పెళ్లికి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే గడువుంది. ఆక్సిడెంట్ తో అన్నయ్య పరిస్థితి విషమంగా మారింది. ఇక కొద్ది రోజులే బ్రతుకుతారు అని తేల్చేశారు డాక్టర్లు.అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చాక పెళ్లికూతురు వారికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వారికి జరిగిందంతా చెప్పేసారు. అప్పుడు నేను ఆఫీస్ కి వెళ్ళాను. సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అంతా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఏంటో అని ఆలోచిస్తుండగా అన్నయ్య విషయం చెప్పాడు. అన్నయ్యకి బదులు నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అన్నయ్య నన్ను కోరాడు.
అదే తన చివరి కోరిక అని చెప్పాడు. దాంతో నాకు ఒప్పుకోక తప్పలేదు. అలా అనుకోకుండా నా పెళ్లి జరిగిపోయింది. అసలు ఆ అమ్మాయి గురించి నాకు సరిగ్గా తెలియదు. తర్వాత మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. మనిద్దరం ఒకరి గురించి ఒకరికి ఏం తెలియదు. ముందు ఫ్రెండ్స్ లా ఉండి తర్వాత మన జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పింది. మనిద్దరికీ ఇబ్బంది ఉండదు అని తను చెబుతుంటే, అది కళా? నిజమా? అసలు ఏమీ అర్థం కాలేదు. నన్ను ప్రేమించే వారు కూడా ఉంటారా, అని నేను అసలు ఊహించలేదు. అలా నాకు నా పెళ్లి తర్వాత ప్రేమను పంచిన భాగస్వామి దరికింది. అప్పుడే నాకు అర్థమైంది ప్రేమ అనేది కేవలం పెళ్లికి ముందే ఉండాలని రూల్ ఏం లేదు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు అని. అందుకు నా జీవితమే ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చాడు ఆ యువకుడు.
READ ALSO : యాంకర్ అనసూయ నాన్న గారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? ఆయన ఎవరంటే ?