Advertisement
ప్రేమ అనే రెండు అక్షరాలు రెండు మనసులను కలుపుతోంది. ప్రేమ అనే వ్యవహారాలు సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. అయితే ఏ జంట అయినా స్నేహం నుంచి మరో అడుగు వేసేటప్పుడు అంటే.. నచ్చిన అమ్మాయికి/ అబ్బాయికి తమలో ఉన్న ప్రేమను తెలియజేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే ఒక ప్రేమికుడు.. మాజీ లవర్ పై స్వీట్ రీవెంజ్ తీసుకున్నాడు. ఇక ఈ రీవెంజ్ పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Advertisement
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ ఘార్ జిల్లా కల్చిపూర్ కు చెందిన అంతర్ అనే కుర్రాడు ఐదేళ్ల క్రితం ఓ పెళ్లికి హాజరయ్యారు. ఆ పెళ్లిలో ఓ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయికి, అంతర్ కు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వారిద్దరూ దాదాపు మూడేళ్లు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఆ తర్వాత వారి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి అంతర్ కు షాక్ ఇచ్చింది. వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడింది. ‘నన్ను ప్రేమించి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడుతున్నావు ఏంటి??’ అని అంతర్ ఆమెను ప్రశ్నించగా, ‘నువ్వు ఇలాగే జాబ్ లెస్ గా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వెయిట్ చేస్తాను. అయినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి ఉద్యోగం, ఇల్లు, ఆస్తులు అన్ని ఉన్నాయి. నేను హాయిగా సెటిల్ అయిపోతాను’ అని అంతర్ ముఖం మీదనే చెప్పిందామె.
Advertisement
దీంతో అంతర్ మొదట ఎంతగానో కృంగిపోయాడు. ఈ జీవితం అనవసరం అనుకుని చనిపోవాలని కూడా అనుకున్నాడు. కానీ అతని స్నేహితుడు అతన్ని వారించాడు. జీవితం చాలా ఉంటుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో అర్థం లేదు. ఇలా చేయడం పొరపాటు అని చెప్పాడు. మోసం చేసిన వారి కోసం ప్రాణాలు తీసుకుంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఇంకొకటి ఉండదని చెప్పి అంతర్ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేశాడు. ఆమె చేసిన మోసం మరిచిపోవడానికి అంతర్ కు దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. అతను బాధనుండి కోలుకున్న తర్వాత కల్చిపూర్ బస్టాండ్ దగ్గర ఓ చాయ్ కొట్టు ఓపెన్ చేశాడు. విచిత్రంగా తన మాజీ ప్రియురాలి పేరును చాయ్ కొట్టుకు పెట్టాడు. అంతేనా తన చాయ్ షాప్ కు వచ్చే సాధారణ వ్యక్తులకు అయితే 10 రూపాయలకు టీను అమ్ముతాడు. తనలా అమ్మాయిలు చేతిలో మోసగించబడ్డ భగ్న ప్రేమికులకైతే సగం ధరకే అంటే 5 రూపాయలకే అమ్ముతాడు. ఇతను ఇలా చేయడం నెట్టింట్లో వైరల్ గా మారింది.