Advertisement
Maname Review: మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటించారు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించారు. మనమే సినిమాను టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.
Advertisement
సినిమా: మనమే
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
నటీ నటులు: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
కథ మరియు వివరణ:
మనమే సినిమాలో హీరో మరియు హీరోయిన్ పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అవుతారు, వీరితో పాటుగా బాబు కూడా ఉంటాడు. అయితే హీరో ఎప్పుడూ బిజీగా ఉంటూ బాబుతో ఎక్కువ సమయం కేటాయించడు దానివల్ల శర్వానంద్, కృతి శెట్టి మధ్య గొడవలు వస్తాయి. ఇలా జరగడంతో కృతి శెట్టి ఏం చేస్తుంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ సినిమాను తప్పక చూడాల్సిందే. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డిఫరెంట్ అటెంప్ట్ లో ఇచ్చే ప్రయత్నం చేసారు. కథ కొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నప్పటికీ రెగ్యులర్ గానే వుంది. సినిమా స్టార్ట్ అయిన మొదటి పది నిమిషాలు బానే వున్నా ఆ తర్వాత నుంచి ప్రేక్షకుడిని చాలా వరకు డిజప్పాయింట్ అయ్యేలా చేసారు.
Advertisement
Also read:
Also read:
ఫస్ట్ హాఫ్ మొత్తం సింపుల్గా వుంది. హై ఎమోషన్, ఎలివేషన్ ఏది కూడా లేదు. నెక్స్ట్ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకు రావాలనే ట్రై చేసారు. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్లకు సెకండ్ హాఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ యే లేదు. సెకండాఫ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే బెటర్. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ వారు ఉన్నప్పటికీ ఇంపాక్ట్ ని చూపించకపోవడం అనేది మైనస్. బిట్ సాంగ్స్, ఫుల్ సాంగ్స్ అన్ని 15 సాంగ్స్ ఉండడం కూడా మైనస్.
ప్లస్ పాయింట్స్:
హీరో పర్ఫామెన్స్
సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్లు:
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
రేటింగ్: 2.25/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!