Advertisement
మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అదంతా ఏమీ లేదని వాళ్ళు చెబుతున్నా సరే ఓ సందర్భంలో వారి మధ్య గొడవలు డిస్టర్బెన్స్ ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి. ఆమధ్య మనోజ్ అనుచరుడిపై విష్ణు గొడవకు దిగిన వీడియో బయటకొచ్చింది. ఇక ఆ తర్వాత మనోజ్ పెళ్లిలో విష్ణు కుటుంబం సందడే కనిపించలేదు. విష్ణు ఫ్యామిలీ పెళ్లి సమయానికి వచ్చి నాలుగు అక్షంతలు వేసి అతిధిలా వచ్చి వెళ్లారు అనే విమర్శలు వినిపించాయి.
Advertisement
Advertisement
మంచు లక్ష్మి మాత్రం తన తమ్ముడు పెళ్లిని భుజాన వేసుకొని స్వయంగా తన ఇంట్లోనే జరిపించింది. ఇలా వరుసగా జరుగుతున్న సందర్భంగా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలోనే మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటో మరోసారి ఈ ఊహగానాలకు తెరలేపింది. మంచు మనోజ్ కు రాఖీ కట్టిన లక్ష్మీ వారితో కలిసి రెస్టారెంట్ లో లంచ్ చేసింది. ఈ మేరకు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. ప్రేమ, సరదా. రుచికరమైన భోజనంతో రాఖీ లంచ్ జరిగిందని రాసుకొచ్చింది. ఆ ఫోటోలో మంచు విష్ణు మాత్రం కనిపించకపోవడం గమనార్హం. అంతా బాగానే ఉంది.. కానీ మంచు విష్ణు ఎక్కడ ? అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు . మంచు విష్ణుకు రాఖీ కట్టలేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు? నెటిజెన్స్.