Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు వారి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఈ ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు ఒక స్టార్ హీరో గా పేరు పొందారు. వీరు సినిమాలో పరంగానే కాకుండా రాజకీయం, బిజినెస్ పరంగా కూడా టాప్ లో ఉంటారు. అయితే మోహన్ బాబు ఇద్దరూ కుమారుల్లో ఒకరు మంచు విష్ణు మరొకరు మంచు మనోజ్.. వీరిద్దరూ సినిమా హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ఇదంతా పక్కన పెడితే.. మంచు మనోజ్ ఇప్పటికే ప్రణతి రెడ్డి అనే ఒక యువతిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసారు. దీంతో అప్పటి నుంచి మనోజ్ వివాహం గురించి ఆలోచించలేదు.
Advertisement
ALSO READ:పూరీ జగన్నాధ్ సినిమాలను వదులుకున్న టాలీవుడ్ హీరోలు !
కానీ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన యువతి మంచు మనోజ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె అందరికీ పరిచయం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. దివంగత భూమా నాగిరెడ్డి శోభ దంపతుల కుమార్తె మౌనిక రెడ్డి అని తెలుస్తోంది.. అయితే తాజాగా మౌనిక రెడ్డి తో కలిసి మంచు మనోజ్ గణేష్ మండపం వద్ద పూజలు చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే భూమా మౌనిక రెడ్డి కి ఇప్పటికే బెంగళూరు కు చెందినటువంటి గణేష్ రెడ్డి తో మొదటి వివాహం జరిగింది.
Advertisement
15 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. రెండేళ్ల కింద గణేష్ తో మౌనిక విడాకులు తీసుకుంది. అనంతరం మౌనిక రెడ్డి హైదరాబాదులో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం మంచు మనోజ్ మరియు మౌనిక చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఒక విల్లాస్ లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు మకాం మార్చారని, వారు అప్పటి నుంచి కలిసే ఉంటున్నారని, మంచు మనోజ్ మోహన్ బాబు కుటుంబంతో కూడా దూరంగా ఉంటున్నారని సమాచారం.. ఈ విషయంపై మంచు మనోజ్ ను మీడియా ప్రశ్నించగా..పెళ్లి అనేది వ్యక్తిగత విషయం అని, టైం వచ్చినప్పుడు బయటపెడతానని, ఆ వార్తలను ఖండించారు.