Advertisement
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభ నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకున్నారు. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మీ నివాసంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో మనోజ్, మౌనిక ఏడడుగులు వేశారు.
Advertisement
Read also: LOVE TODAY HEROINE IVANA: క్యూట్ లుక్స్ తో అందరి మనసులు దోచిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?
అయితే మౌనిక మరియు మంచు మనోజ్ ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహమే. ఇదివరకే పెళ్లి కాగా ఈ ఇద్దరు విడాకులు తీసుకుని సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఇక మౌనిక రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో మంచు మనోజ్ కి కష్టాలు కూడా మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలు ఆగిపోతున్నాయి. ఇప్పటికే చాలా రోజులుగా అతని కెరీర్ ముందుకు వెళ్లడం లేదు. ఇక మౌనిక రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో మనోజ్ కి కుటుంబం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు. తాను నటించే సినిమాలు కూడా ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు.
Advertisement
అందుకే సినిమాల పరంగా మంచు మనోజ్ కెరియర్ ప్రశ్నార్థకంగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. మొదట్లో రాజకీయాల్లోకి రావాలనుకున్న మంచు మనోజ్ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి కూడా విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఇలా కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకోవడం వల్ల నందమూరి తారకరత్న కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. సినిమాలు పోయి, కెరియర్ కోల్పోయి, కుటుంబానికి దూరమై డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అది చిన్న వయసులోనే గుండెపోటుతో తారకరత్న కన్నుమూశాడు. కానీ మంచు మనోజ్ కూడా ఇలా కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. అలాగే కెరియర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరి ఇది ముందు ముందు ఇలాగే జరిగితే మరిన్ని సమస్యల్లో పడే అవకాశం ఉంది.
Read also: సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో !