Advertisement
మంచు మోహన్ బాబు తనయుడు, ప్రముఖ హీరో మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డిని మార్చి 3వ తేదీన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంచు లక్ష్మి ఈ వివాహ వేడుకకు అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే మంచు మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహం అన్న విషయం తెలిసిందే.
Advertisement
Reqad also: ఈ సినిమాలు చేసి ఉంటే ఉదయ్ కిరణ్ తిరిగి నిలదొక్కుకునేవాడు!
మంచు మనోజ్ మొదట ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక భూమా మౌనికకు 2016లో బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 2018లో ఓ కుమారుడు జన్మించాడు. అతనే ధైరవ్. అయితే గణేష్ తో మౌనికకు మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ధైరవ్ మౌనిక వద్దే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు భూమ మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ఆ బాబు బాధ్యతలను కూడా మనోజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్ – మౌనిక పెళ్లిలో ధీరవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Advertisement
ఆ తర్వాత మనోజ్ ఓ ఫోటో ట్వీట్ చేశారు. ఆ ఫోటో ద్వారా మౌనిక కొడుకు బాధ్యత కూడా తనదే అని చెప్పకనే చెప్పాడు. మనోజ్ తన ఇంస్టాగ్రామ్ లో తన చేతులతో మౌనిక చేతులు, ధైరవ్ రెడ్డి చేతులు పట్టుకున్న ఫోటో షేర్ చేశాడు. కామెంట్ గా ” శివాజ్ఞ” అని పెట్టాడు. కాబట్టి ధైరవ్ మనోజ్ అడాప్టెడ్ సన్ అన్నమాట. శివుని ఆజ్ఞతో మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు.. అలాగే ఇందులో మరో అంతరార్థం ఏమిటంటే మౌనిక కొడుకు ధైరవ్ బాధ్యత కూడా తానే తీసుకున్నానని మనోజ్ ఈ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పేశారు. దీంతో మనోజ్ మంచి మనసుకు నేటిజెన్లు ఫిదా అవుతున్నారు.
Read also: భారతదేశ చరిత్రలో ఎక్కవ కాలం సీఎం పదవిలో నాయకత్వం వహించిన నాయకులు వీరే ..!