Advertisement
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే ఊహగానాలు తెరమీదకి వస్తున్నాయి. ఇదివరకే మంచు మనోజ్, ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏమో కానీ 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగాను ఒడిదొడుకులు ఎదుర్కొన్న మనోజ్ సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. అప్పటినుంచి సింగిల్ గానే ఉంటున్న మనోజ్ తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. భూమా నాగ మౌనికను మనోజ్ పెళ్లి చేసుకొనున్నారని టాక్. అయితే వీరి పెళ్లి అడ్డంకులు ఉన్నాయా ? అయితే అవేంటో తెలుసుకుందాం.
Advertisement
ఈమె దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల, రెండవ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఈమె అసలు పేరు భూమా నాగ మౌనిక. ఈమెకు గతంలో బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయింది. 5 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. కానీ మొదటి భర్తతో ఈమె విడాకులు తీసుకుంది. తండ్రిలానే ఈమె కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈమె చాలా అగ్రెసివ్ పర్సన్. అలా అని ప్రతిసారి విషయాన్ని పెద్దది చేసి మాట్లాడదు. ఈమెను ఎవరు ఇబ్బంది పెట్టనంత వరకు చాలా సౌమ్యంగా, మర్యాదగానే మాట్లాడుతుంది. నాగ మౌనిక చాలా తెలివైన వ్యక్తి. కొన్నాళ్లుగా ఈమె హైదరాబాద్ లోనే ఉంటున్నారు. తన సోదరి అఖిల ప్రియతో ఈమెకు ఆస్తి వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాలని భూమా మౌనిక భావిస్తున్నారు.
Advertisement
2018 నుండి నాగ మౌనికకు, మంచు మనోజ్ మధ్య పరిచయం ఏర్పడింది. మనోజ్ సామాజిక సేవలు చేస్తుంటాడు. అందులో భాగంగానే మౌనికతో మనోజ్ కి పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం మనోజ్, మౌనికతో కలిసి ఉంటున్నట్టు కూడా కొన్నాళ్ల నుండి ప్రచారం జరుగుతుంది. కానీ సినిమా వాళ్లపై ఇలాంటి వార్తలు మామూలే అని అంతా భావించి లైట్ తీసుకున్నారు. భూమా మౌనిక ఆస్తుల విలువ సుమారు రూ. 2000 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె విడాకులు తీసుకున్న టైం లో కూడా భరణంగా రూ. 250కోట్ల వరకు అందుకున్నట్టు తెలుస్తుంది.మౌనికనీ, మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం అతని కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని వినికిడి. అందుకే మనోజ్ ఇప్పుడు అతని కుటుంబంతో దూరంగా ఉంటున్నాడని సమాచారం. మౌనిక కంటే ముందు, అంటే గతంలో మనోజ్ వివాహం చేసుకున్న ప్రణతి కూడా రెడ్డి సామాజిక సామాజిక వర్గానికి చెందిన యువతే! ఇప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అది కూడా విడాకులు తీసుకొని, కొడుకుతో కలిసి ఉంటున్న యువతీతో అంటూ మంచు ఫ్యామిలీలో డిస్కషన్లు మొదలైనట్టు సమాచారం.
Read also : చిరంజీవి నుంచి సమంత వరకు, మన స్టార్లు ఇష్టంగా తినే ఫుడ్స్ ఇవే!