Advertisement
మంచు విష్ణు, మనోజ్ మండే వివాదం రోడ్డున పడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్ గా పెట్టాడు మనోజ్. మనోజ్ ఫేస్బుక్ స్టోరీ పోస్టుతో ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. వారి మధ్య విభేదాలను బయట పెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తన వాళ్ళను, బంధువులను కొడుతూ ఉంటాడు అంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి.
Advertisement
READ ALSO : అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోలుగా ఎదిగిన టాలెంటెడ్ హీరోలు వీరే..!!
ఈయన మోహన్ బాబుకు వరసకు సోదరుడు అవుతారు. మొదట్లో సారథి, విష్ణుకు కుడి భుజంలా ఉంటూ వచ్చారు. కాలక్రమమైన విష్ణు నుంచి దూరం జరిగి మోహన్ బాబుకు దగ్గరయ్యారు. ఈ మధ్య మంచు మనోజ్ తో చాలా క్లోజ్ గా ఉంటూ అతడి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాడు మనోజ్. విష్ణు తరచు ఇలా చేస్తున్నాడు అంటూ మనోజ్ కామెంట్ చేశారు.
Advertisement
READ ALSO : వైరల్ గా బాలకృష్ణ పెళ్లి శుభలేఖ
మేము ఏమైనా ఊరికే ఇచ్చామా, తీసుకున్నామా అంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి. కాగా మంచు మనోజ్ తాజాగా డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల మనోజ్ పెళ్లి సమయంలో కూడా విష్ణు తన ఫ్యామిలీతో కలిసి జస్ట్ ఓ గెస్ట్ గా మాత్రమే వచ్చి వెళ్ళాడు. దీంతో వారి మధ్య గ్యాప్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
READ ALSO : Jayam Movie Child Artist: జయం సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలాఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..!!