Advertisement
టాలీవుడ్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తున్నాయని వార్తలు వినిపిస్తూ వస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో వీరి ఫ్యామిలీలో ఉన్న గొడవాలని బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచు బ్రదర్స్ మధ్య జరిగిన గొడవ చిన్నదేం కాదు. అసలు ఈ గొడవకు కారణం ఎవరు అంటే అందరూ చెప్పే సమాధానం సారథి. అసలు ఎవరితను, మంచు బ్రదర్స్ మధ్య ఎలా వచ్చాడు? వీరి మధ్య చిచ్చు పెట్టడం ఏంటి? అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.
Advertisement
READ ALSO : PAWAN KALYAN : పవన్ కళ్యాణ్ స్టామినా ని బాక్స్ ఆఫీస్ కి, తెలుగు ప్రజలకి దగ్గర చేసిన 10 సినిమాలు !
అసలు ఈ సారథి ఎవరంటే, మంచు విష్ణు అనుచరుడు. వీరు ఒకసారి పాత వీడియోలు చూస్తే మంచు విష్ణు పక్కన సారథి కనిపిస్తాడు. మంచు విష్ణుకు సంబంధించిన ప్రతి విషయం అతనికి తెలుసు. మా ప్రెసిడెంట్ అయ్యే వరకు కూడా విష్ణు పక్కనే సారథి ఉన్నాడు. అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ సారథి అన్నను వదిలి తమ్ముడు పక్కకు చేరాడు. ప్రస్తుతం మనోజ్ కు మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఈ మనోజ్ పక్కన ఉండి, విష్ణు పర్సనల్ విషయాలను కూడా అతను మనోజ్ చెప్తున్నాడట.
Advertisement
READ ALSO : అతను లారీ డ్రైవర్! ఆమె చదువుల తల్లి! సినిమాని మించిన పెద్దిరాజు ప్రేమగాధ!
విష్ణు గురించి మనోజ్ కు నెగిటివ్ గా చెప్తూ అతనిపై కోపం తెప్పించేలా మాట్లాడుతున్నాడట. అది నచ్చని విష్ణు సారథిపై గుర్రుగా ఉన్నాడని చెప్తున్నారు. అంతేకాకుండా విష్ణుపై అనుచిత వాక్యాలు చేయడంతోనే కోపం తట్టుకోలేక విష్ణు సారధిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే తన వద్ద మేనేజర్ గా చేస్తున్న వ్యక్తిని తాను ఎప్పుడూ ఉద్యోగిగా చూడలేదని, బంధువుగానే చూశానని మనోజ్ చెప్పడం విశేషం. అందుకే వీడియోలో కూడా మా బంధువులపై దాడి చేస్తున్నాడని విష్ణు పేరును చెప్పుకొచ్చాడు. ఇలా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది సారథినే అని తెలుస్తోంది.
READ ALSO : ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!