Advertisement
సాధారణంగా మనం ఏదైనా పెళ్లిళ్లలో చూసినప్పుడు వెళ్లినటువంటి బంధుమిత్రులు స్నేహితులు ఎవరైనా సరే అట్టి పెళ్లిలలో చదివింపులు చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది డబ్బులు చదివింపులు ఇస్తే, మరి కొంతమంది వస్తువుల రూపంలో చదివింపులు ఇస్తుంటారు. ఎవరి రేంజ్ కు తగ్గట్టు వారు ఈ కానుకలు అనేవి ఇస్తూ ఉంటారు. మరి పెళ్లిళ్లలో కానీ ఇతర ఫంక్షన్లలో కానీ చదివింపులు ఎందుకు ఇస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు.. ఈ చదివింపులనే కథ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
పూర్వకాలంలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి జరిగింది అంటే చుట్టుపక్కన వాళ్లు తల ఒక 100 లేదంటే 50 పాతిక ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పెళ్లి అమ్మాయి ఇంట్లో చదివింపులు ఇచ్చేవారు. దీన్ని అమ్మాయి తరఫున వారు ఒక బుక్ లో రాసుకునేవారు. అయితే ఆ డబ్బంతా పెళ్లయ్యే అమ్మాయికి కాకుండా కన్యాదాతకి వెళ్ళేది. ఈ వచ్చిన డబ్బుతో ఆయన పెళ్లి ఖర్చులు సర్దుకునేవారు. ఈ విధంగా మన పెళ్లికి ఎవరైనా బంధువులు వంద రూపాయలు వేసారు అనుకోండి. మళ్లీ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు మనం వారు వేసిన వందకి ఎంతో కొంత కలిపి మళ్లీ చదివింపులు చేసేవారు.
Advertisement
అలా ప్రతి పెళ్లిలో కానీ ఇతర ఫంక్షన్లలో కానీ చదివింపులు అనేవి మొదలవుతూ వచ్చాయి. ఈ చదివింపులను, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో ఈడేతలు అంటారు. అలాగే కొన్ని ప్రాంతాలలో కట్నాలు అంటారు. ఈ విధంగా పూర్వకాలం నుంచి వస్తున్న ఈ తంతు మారుతూ వస్తోంది. ప్రస్తుతం చాలామంది ఏదో ఒక వస్తు రూపంలో, లేదంటే గిఫ్ట్ ల రూపంలో చదివింపులు ఇస్తున్నారు. ఈ విధంగా పెండ్లిలలో మాత్రమే ఉండే ఈ చదివింపులు, ఇతర ఫంక్షన్లకు కూడా పాకాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: