Advertisement
మధ్యాహ్నం 2 అవుతోంది, అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చాను.. ఇంటి ముందు వివిధ వాహనాలు నిలిచి ఉన్నాయి.. ఏం జరిగిందో అని మనసులో అనుకుంటూ హల్లోకి వెళ్ళగానే అన్నీ కొత్త మొహాలు.. కూర్చుని ఉన్నారు.. నేను నేరుగా తలదించుకుని రూంలోకి వెళ్ళిపోయా.. నా వెనకే అమ్మ వచ్చింది.. చీర కట్టుకొని రెడీ అవ్వు అంటోంది.. దీంతో నేను ఆశ్చర్యపోయా, నాతో ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది.. నీకు పెళ్లి చూపులు..!! మాట వినగానే గుండెల్లో ఏదో తెలియని దడదడ.. డిగ్రీ చదువుతున్న నాకు బాగా చదివి గొప్ప ఆఫీసర్ కావాలనే ఆశ అయితే ఏమీ లేవు కానీ, డిగ్రీ కంప్లీట్ చేసుకొని చిన్న స్కూల్ లో కొన్నాళ్లపాటు టీచర్ గా ఉద్యోగం చేయాలని నా ఆశ.. చిన్న పిల్లలకు చదువు చెబుతూ కొద్ది రోజులు గడిపితే ఏ బాధ అయినా మర్చిపోవచ్చు అనేది నా ఫీలింగ్.. కానీ నా ఆశలకు బ్రేక్ పడింది.. నా ఫీలింగ్స్ కూడా పక్కనపెట్టి హాల్ లోకి వెళ్ళా.. వారంతా మాట్లాడుతున్నా, నా చెవులకు ఎక్కట్లేదు.. సరిగ్గా పది నిమిషాల తర్వాత ఒక మాట స్పష్టంగా వినబడింది..
Advertisement
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 14.10.2022
అమ్మాయి నాకు బాగా నచ్చింది అని.. పెళ్లయితే కుదిరింది.. పెళ్లికి మూడు నెలలు టైం మాత్రమే ఉంది.. ఈ మూడు నెలల్లో ముచ్చటగా మూడుసార్లు కూడా అబ్బాయి తో మాట్లాడలేదు.. తను ఎట్లాగు మాట్లాడలేదు.. నేను అయినా ధైర్యం చేసి మాట్లాడదామంటే భయం.. పెళ్లి దగ్గరికి వచ్చింది.. రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.. అంతలో ఒక ఫోన్ వచ్చింది.. రెండే రెండు మాటలు మాట్లాడి పెట్టేసాడు.. పెళ్లి తర్వాత డ్రెస్సులు వేసుకోవద్దు, చీరలు మాత్రమే కట్టుకోవాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనే కోరికలు ఏమైనా ఉంటే తీసేయ్.. నన్ను నా కుటుంబాన్ని చూసుకుంటే చాలు అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు మా పెళ్లయిన ఫ్రెండ్స్ నాతో మాట్లాడడానికి ఎందుకు భయపడతారో.. లోపల ఏదో తెలియని భయం.. నేను అత్తారింటికి కాకుండా జైలులోకి వెళ్తున్నానా అనే ఫీలింగ్ కలుగుతోంది.. పెళ్లి డేట్ వచ్చేసింది. ఇల్లంతా చుట్టాలతో నిండింది. అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు.. నా మనసే గందరగోళం..
Advertisement
కనీసం నాతో మాట్లాడడానికి ఇష్టపడని వ్యక్తి, నా ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకుని వ్యక్తి, పెళ్లికి ముందే ఇన్ని షరతులు విధించిన వ్యక్తితో నేను ఎలా ఉండగలను, ఒక్కసారిగా గుర్తొచ్చాడు గణేష్.. చిన్నప్పట్నుంచి నాతో చదువుకున్నాడు.. ఇంటర్ లో నన్ను ప్రపోజ్ కూడా చేశాడు. కానీ నో చెప్పా.. నా ఇష్టాయిష్టాలు ఏంటో అతనికి పూర్తిగా తెలుసు నేను ఎక్కడికి వెళ్లినా నా వెంటే ఫాలో అవుతూ ఉండే వాడు, నన్నెప్పుడు ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా చూసుకునేవాడు.. తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తే నా కోసం ఒక స్కూల్ పెడతా అందులో నువ్వు టీచర్ గా చేస్తూ గాని అని అనేవాడు. అదంతా గుర్తొచ్చింది మనసంతా సంతోషంతో నిండింది. కానీ అమ్మా నాన్ననీ బాధ పెట్టలేను.. పెళ్లి జరుగుతోంది.. పెళ్లికి గణేష్ కూడా వచ్చేశాడు.. దూరంగా నిలిచిన గణేష్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.. అది నాకు స్పష్టంగా కనబడుతోంది.. నా మనసు అంతకంటే ఎక్కువ బాధ పడుతుంది. ఏం చేయలేని పరిస్థితి.. గుండె నిండా బాధ తరుక్కుపోతోంది.. ఇంతలో ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు. దీంతో ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చి నవ్వు నవ్వా.. అరిచిన వ్యక్తి ఎవరో కాదు.. ఫోటోగ్రాఫర్.. తను అన్న మాట స్మైల్ ప్లీజ్..😄😄
also read: