Advertisement
ప్రస్తుత కాలంలో కొన్ని ప్రేమలు ప్రాణాల మీదికి వస్తున్నాయి. తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అలా ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి అతనితో పెళ్లి జరగలేదని చివరికి ఏం చేసిందో చూద్దాం.. ప్రేమించిన వ్యక్తిని కాదని మరో వ్యక్తితో పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు.. ఆయనతో ఉండలేక చివరికి ప్రియుడిని కలిసి ఏం చేసిందంటే..
Advertisement
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య రాజేశ్వరి దంపతులకు కుమార్తె మానస ఉంది. ఆమె విజయ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే ఆమెకి ఈనెల 11న మరో అబ్బాయి తో పెళ్లి చేశారు. పెద్దల మాట కాదనలేక మనసులో మాట చెప్పలేక తలవంచుకొని తాళి కట్టించుకుంది. విజయ్ ని మర్చిపోలేని మానస ఈ నెల 19న హనుమకొండలో అతడిని కలిసింది.
Advertisement
నేను అతనితో ఉండలేకపోతున్నానని నువ్వే కావాలని విజయ్ కి చెప్పింది. దీంతో వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషం తీసుకున్నారు. దీన్ని గమనించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడే మనస మృతి చెందింది. ప్రియుడు విజయ్ హైదరాబాదులో చికిత్స పొందుతున్నాడు.
మరికొన్ని ముఖ్య వార్తలు :