Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఒక మరపురాని అపురూపమైన ఘట్టం.. వివాహం ఏ వయసులో చేసుకోవాలో అదే వయసులో చేసుకుంటేనే దానికి అందం చందం ఉంటుంది. అలాంటి వివాహం ప్రస్తుత కాలంలో చాలా మంది లేట్ చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. మరి వివాహం చేసుకోవాలి అంటే ఎంత వయస్సు ఉండాలి, ఏ సమయంలో చేసుకుంటే మనకు లాభాలు ఉంటాయో మనం ఓసారి చూద్దాం.. ప్రస్తుత కాలంలో యువకులు వివాహాన్ని చాలా లేట్ చేస్తున్నారు.. మరి ఆలస్యం చేయడం మంచిది కాదని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. 40 ఏళ్లు వచ్చేదాకా కొంతమంది వివాహం ఊసే ఎత్తడం లేదు. మరి ఏ వయసులో మనం వివాహం చేసుకోవాలి అనే విషయం చూద్దాం..
Advertisement
also read:నాకు 40… తనకు 20.! ఇది మా స్టోరి!
1. ప్రతి ఒక్కరి జీవితంలో 18 నుంచి 25 సంవత్సరాల వరకు వారి కెరీర్లో ఒక ముఖ్యమైన సమయం. ఈ సమయాన్ని వృధా చేయకుండా కెరీర్ పై దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుంది.. అలాంటి సమయంలో వివాహం చేసుకుంటే కెరీర్ పై దృష్టి పెట్టలేరు. కాబట్టి 28 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు కెరియర్ పై బాధ్యత పెరిగి కాస్త అవగాహన కూడా వస్తుంది. అవతలి వారిని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మనం ఏ పొజిషన్లో ఉన్నామో అవతలివారు ఏం అనుకుంటున్నారో అనే విషయాన్ని గ్రహించే జ్ఞానం మనకు వస్తుంది. అందుకే ఈ వయసులో పెళ్లి చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.
Advertisement
2. ఇలా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు వివాహం చేసుకుంటే ఉద్యోగంలో కూడా స్థిరపడి నిలదొక్కుకోగలుగుతారు. ఈ వయసులో వారి బాధ్యతను కాకుండా అవతలి వ్యక్తి బాధ్యత కూడా తీసుకునే పూర్తి విశ్వాసం వీరికుంటుంది. తర్వాత వీరి సంసార జీవితం సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది.
3. అదే విధంగా ఈ వయసులో పెళ్లి చేసుకుంటే డబ్బు విషయంలో కూడా ఆలోచిస్తారు. దుబారా ఖర్చు చేయకుండా జీవితంపై పూర్తి పరిణతి చెంది ఉంటారు. ఏది చేయాలన్నా అవగాహనతో ఆలోచించుకొని తప్పులు జరగకుండా చేసే అవకాశం ఉంటుంది.
also read:వెంకటేష్ కొడుకు.. అర్జున్ దగ్గుబాటి ఎంత అందంగా ఉన్నాడో చూసారా?