Advertisement
మన తాత వాళ్ల తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇది వరకు రేట్లు గురించి చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. రూపాయి పెడితే చాలా వచ్చేవి అని వాళ్ళు అంటూ వుంటారు, మీకు కూడా మీ తాత లేదంటే అమ్మమ్మ ఎవరైనా చెప్పే ఉంటారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు పెడుతూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
Advertisement
ఇక ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే… ఒక అప్పుడు మసాలా దోశ బిల్. మరి ఇక అందులో ఏముంది..? ఆశ్చర్య పోవాల్సిన సంగతి ఏంటి అనేది తెలుసుకుందాం.. పూర్వం ప్రజలు ఎలా ఉండేవారు.. ఎంత డబ్బులు ఖర్చు అయ్యేవి.. పాత శుభలేఖలు.. పాత కరెంట్ బిల్లులు.. కిరాణా బిల్లు ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు మనకి కనబడుతూనే ఉంటాయి. ఈ క్రమం లోనే తాజాగా సోషల్ మీడియాలో మసాలా దోశ బిల్లు కనబడింది.
Advertisement
ఇది చూసి సోషల్ మీడియా యూజర్స్ అందరు కూడా అవాక్ అవుతున్నారు. ఈ బిల్లు 29 జూన్ 1971 లోనిది ఈ బిల్లు లో మసాలా దోశ కాఫీ గురించి రాశారు. ఢిల్లీ మోతీ మహల్ హోటల్ లో మసాలా దోశ ధర అప్పుడు ఎంతో గెస్ చేయండి… ఈ ధర చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మసాలా దోస ధర కేవలం ఒక్క రూపాయి మాత్రమే. కాఫీ ధర కూడా ఒక్క రూపాయే. ఈ రెండు కలిపి రెండు రూపాయలు. సర్వీస్ టాక్స్ ఆరు పైసలు. సర్వీస్ చార్జీ పది పైసలు అని ఆ బిల్లు మీద రాసి ఉంది మొత్తం గా రెండు రూపాయలు 16 పైసలు. ఇది చూసి సోషల్ మీడియా యూజర్స్ షాక్ అవుతున్నారు.
Also read:
ప్రపంచం అంతా మెప్పించిన ఈ రామాయణ సినిమా ని ఇండియా లో ఎందుకు బ్యాన్ చేసారు..? కారణం ఏమిటి..?
డీజిల్ బైకులని, స్కూటీలని ఎందుకు తయారు చేయరు..? కారణం ఏమిటి అంటే..?