Advertisement
టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 80 సినిమాలకు పైగా చైల్డ్ ఆర్టిస్ట్గా మాస్టర్ భరత్ నటించాడు. హలో తెలుగు ప్రేక్షకులకు మాస్టర్ భరత్ చాలా దగ్గరయ్యాడు. చిట్టి నాయుడు గా చిన్నతనం నుంచి అద్భుత నటనను ప్రదర్శించిన.. మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు శిరీష్ ఏబిసిడి సినిమాలో సెకండ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. భరత్ పెద్దయ్యాక హీరో అవ్వాలని అనుకున్నాడు. దాని కోసం బరువు తగ్గడం మొదలు పెట్టాడు. ఎన్నో కఠినమైన వ్యాయామాలు చేశాడు భరత్.
Advertisement
అయితే ఈ నేపథ్యంలోనే భరత్ కెరీర్లో ఓ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యాయామం చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం వల్ల భరత్ కుడి కన్ను పోయింది. ఈ విషయాన్ని స్వయంగా భరత్ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. జిమ్ చేస్తున్న సమయంలో రాడ్ కు ఉన్న స్ప్రింగ్ వచ్చి కన్నుకు తగలడంతో తాను చూపులు కోల్పోయినట్లు ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Advertisement
అంతేకాకుండా సినిమాలలో నటిస్తూ తన చదువును ఎప్పుడూ కూడా పక్కకు పెట్టలేదని తెలిపాడు. తాను మెడిసిన్ పూర్తి చేసినట్లు భరత్ వెల్లడించారు. చాలామంది అమ్మాయిలు తనకు ప్రపోస్ చేశారని కూడా తెలిపాడు. ఎంతమంది తనకు ప్రపోస్ చేసినప్పటికీ తాను తల్లి చాటు బిడ్డ నేను అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు భరత్. ఇది ఇలా ఉండగా ఏబిసిడి సినిమాతో… భరత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. త్వరలోనే మరిన్ని సినిమాలు చేయనున్నాడు భరత్.