Advertisement
Mathagam 2 Webseries Review in Telugu: అథర్వ మురళి, మణికందన్, గౌతమ్ మీనన్, శరత్ రవి, వడివుక్క రాసి, నిఖిలా విమల్, ఇళవరసు, రిషికాంత్, డెల్నాజ్ ఇరానీ తదితరులు నటించారు. ప్రశాంత్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ ఒరిజినల్స్ నిర్మించింది. దర్బుక శివ సంగీతాన్ని అందించారు.
Advertisement
వెబ్ సిరీస్: మథగం 2
నటీనటులు: అథర్వ మురళి, మణికందన్, గౌతమ్ మీనన్, శరత్ రవి, వడివుక్క రాసి, నిఖిలా విమల్, ఇళవరసు, రిషికాంత్, డెల్నాజ్ ఇరానీ తదితరులు
దర్శకత్వం: ప్రశాంత్ మురుగేశన్
సంగీతం: దర్బుక శివ
నిర్మాత: డిస్నీ ప్లస్ ఒరిజినల్స్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
Mathagam Websereis: Story, OTT Platform, Release Date and Review కథ మరియు వివరణ:
ఇక కథ విషయానికి వస్తే.. సంగు గణేషన్ అనే రౌడీ షీటర్ అనుచరులతో రాత్రిపూట ఒంటరిగా ఓ దగ్గరకి బయల్దేరి వెళ్తాడు. చిన్న యాక్సిడెంట్ వలన పోలీసులకు దొరుకుతారు. ఓ ఆఫీసర్ సంగు గణేషన్ ని గుర్తుపట్టి ఎంక్వైరీ చేస్తుంటే, ఫోన్ వస్తుంది.
గుణ అనే ఒక వ్యక్తి సంగు గణేషన్ కి ఫోన్ చేసి, రేపు పార్టీకి అన్నీ రెడీ చెయ్యాలంటే, లేకుంటే తిమింగిలం వదిలిపెట్టడని చెప్తాడు. అయితే ఆ పోలీస్ ఎవరు తిమింగిలం అని అడుగగా పడాలం శేఖర్ అంటాడు. అతను చనిపోయాడని పక్కన ఉన్న కానిస్టేబుల్ అంటాడు. నిజం చెప్పమని సంగు గణేషన్ ని పోలీస్ అంటే, చనిపోలేదని బ్రతికే ఉన్నట్టు చెప్తాడు. ఇక ఈ పడాలం శేఖర్ ఎవరు…? పడాలం శేఖర్ పనులను పోలీస్ వ్యవస్థ ఎలా ఆపుతుంది..?
Advertisement
అసలు అతను ఏం చేస్తాడు..? ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్ చాలా స్లోగా సాగుతుంది. మొదటి పార్ట్ మొత్తంగా అయిదు ఎపిసోడ్‌లు వున్నాయి. ఈ స్టోరీ అంతా ల్యాగ్ చేసాడు డైరెక్టర్. సో కథలోకి వెళ్ళినా పెద్దగా ఆసక్తిని లేకపోయింది. మంచి సీన్స్ వున్నా ఆసక్తి రాదు. మథగం వెబ్ సిరీస్ లో కథని నడిపిన పద్దతి సెట్ కాలేదు. స్లో గా వెళ్తుంది అంతా. పైగా పెద్దగా ట్విస్ట్ లు కూడా లేవు. సీరియస్ గా కూడా లేదు.
ఎక్కువ పాత్రలు ఉండడం వలన, ప్రేక్షకులకు పాత్రలని గుర్తుంచుకోవడం బాగా కష్టంగా ఉంటుంది. అశ్వధ్ పాత్రని కూడా బాగా చూపించలేదు. కథ ఏమీ లేదు కానీ బాగా సాగదీశారు. హీరోకి సరైన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా బాలేదు.
ప్లస్ పాయింట్స్ :
అక్కడక్కడ సీన్స్
నటీనటులు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సాగదీత సన్నివేశాలు
హీరో పాత్రకి పెద్దగా లేకపోవడం
కథ
ట్విస్టులు లేకపోవడం
రేటింగ్ : 2 /5
Also read:
- God Review in Telugu: గాడ్ సినిమా కథ, రివ్యూ & రేటింగ్…!
- భార్యలు ఈ 5 సూత్రాలు పాటిస్తే.. భర్తలు పొరపాటున కూడా మరో అమ్మాయిని చూడరు!
- చంద్రబాబు నాయుడుకు జైలులో ఎలాంటి ఆహరం పెడతారు? ఆయనకు ఇచ్చే బ్రేక్ ఫాస్ట్ ఏంటంటే?