Advertisement
Mechanic Rocky Review: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, నరేష్ ఈ సినిమాలో నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
Advertisement
సినిమా: మెకానిక్ రాకీ
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
నటీ నటులు: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, నరేష్
సినిమాటోగ్రఫీ: మనోజ్ కటసాని
సంగీతం: జేక్స్ బిజోయ్
రిలీజ్ డేట్: 22-11-2024
కథ మరియు వివరణ:
స్టోరీ చూస్తే.. విశ్వక్ సేన్ తండ్రి నుంచి ఆర్ కే గ్యారేజ్ ని ఆక్రమించుకోవాలని చూస్తాడు. వాళ్ళు నుంచి గ్యారేజ్ ని ఎలా కాపాడాడు…? గ్యారేజీకి, వాళ్ళ నాన్నకి మధ్య ఉన్న ఎమోషన్ ఏంటి..? గ్యారేజ్ ని దక్కించుకున్నాడా లేదా..? ఏం చేస్తాడు..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. దర్శకుడు రవితేజ సినిమాని ఎంగేజింగ్ గా తీసుకువెళ్లడానికి ట్రై చేశారు. కానీ అంతలా ఫలించలేదు. మొదటి హాఫ్ బోరింగ్ గా ఉంటుంది. హీరో ఏం చేస్తున్నాడు, అసలు స్టోరీ ఎటు వెళ్తోంది..? ఇంటర్వల్ అయ్యే వరకు ఓ క్లారిటీ రాదు సెకండ్ హాఫ్ లో మాత్రం మూవీకి సంబంధించి ప్రతీది ఎంతో క్లుప్తంగా రాశారు. అలాగే రెండో పార్ట్ కి సరైన పే ఆఫ్ ఇచ్చాడు. ఏది ఏమైనా సెకండ్ హాఫ్ లో ఇచ్చిన పే ఆఫ్ అద్భుతంగా ఉంది.
Advertisement
ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా నడుస్తుంది. రెండో పార్ట్ మాత్రం ఫాస్ట్ గా కదిలినట్టు ఉంటుంది. దానికి తగ్గట్టుగా టామ్ అండ్ జెర్రీ వార్ లాగా హీరో విల్లన్ కి మధ్య పోటీ కూడా ఉంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ ని పక్కన పెడితే రెండవ హాఫ్ అద్భుతంగా ఉంది. కొన్ని ఎలివేషన్స్ కూడా ఉన్నాయి అందులో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బావుంది. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మధ్య వేరియేషన్ చూపించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా లేకపోవడం కాస్త సినిమాకి మైనస్ అయిందని చెప్పొచ్చు.
ఇక నటీ నటులు విషయానికి వస్తే విశ్వక్ వన్ మ్యాన్ షో చేశారని చెప్పొచ్చు. ప్రతీ సీన్ లో కూడా అద్భుతంగా నటించారు. మిగిలిన నటులు కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బానే నటించారు. సునీల్ పాత్ర కూడా బావుంది టెక్నికల్ అంశాల గురించి చూస్తే.. మ్యూజిక్ సో సో గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ రివీల్ అయినప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ బానే ఉంది.
ప్లస్ పాయింట్స్
విశ్వక్ నటన
రెండవ పార్ట్
ట్విస్టులు
Also read:
మైనస్ పాయింట్లు
పాటలు
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు
కొన్ని అనవసరమైన సన్నివేశాలు
రేటింగ్ 2.5/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!