Advertisement
మీనాక్షి చౌదరి అందరికీ సుపరిచితమే. ఇచ్చట వాహనాలు నిలపరాదు, కిలాడి వంటి సినిమాల్లో నటించారు అలాగే గుంటూరు కారం సినిమాతో పాపులారిటీని పెంచుకున్నారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్ష్మీ భాస్కర్, విశ్వక్సేన్ తో మెకానిక్ రాకీ వరుణ్ తేజ్ తో మట్కా సినిమాలు చేస్తున్నారు. సోషియోఫాంటసీ యాక్షన్ ఫిలిం విశ్వంభరలో ఒక ఫిమేల్ లీడ్ లో కనపడబోతున్నారు. మొత్తం మీద నాలుగు తెలుగు సినిమాల్లో అలరించడానికి రెడీ అయిపోయారు.
Advertisement
మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. హర్యానాలోని పంచకులలో ఈమె పుట్టారు. తండ్రి బీఆర్ చౌదరి భారత సైన్యంలో కల్నల్ గా పని చేశారు. చండీగఢ్లో ఈమె స్కూలింగ్ పూర్తి చేశారు. స్టేట్ లెవెల్ స్విమ్మర్ కూడా. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచి ఆశ్చర్యపరిచారు. పంజాబ్ లోని ఒక హాస్పిటల్లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అలా డాక్టర్ కూడా అయ్యారు.
Advertisement
Also read:
Also read:
మిస్ హర్యానా 28 టైటిల్ గెల్చుకున్నారు. 2019లో అనే ఒక హిందీ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఈమె చేసే వాటన్నిటికీ ఏ లింక్ లేదని.. అన్ని కలిసి వచ్చాయని నా జీవితం ఒక బ్లెస్సింగ్ అని ఆమె అన్నారు. అందుకే రోజు నిద్ర లేవగానే నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను అని అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!