Advertisement
చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయి విషాదంలో మునిగిపోయింది మీనా కుటుంబం. ఆమె బాధ వర్ణనాతీతం. ఆయన దూరమై ఇప్పటికి ఏడు రోజులు అయింది. ఇంకా ఆమెకు సంబంధించిన సన్నిహితులు,ఇండస్ట్రీకి చెందినవారు వారింటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. తన భర్త వెళ్లిపోయాడని షాక్ లో ఉన్నా ఆ రోజు స్వయంగా మీనా తన భర్త చివరి కార్యక్రమాలు చూసుకోవడం మరొక షాకింగ్ గా చెప్పవచ్చు. అదేంటి ఆవిడ ఎందుకు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ లేరా.. అనే సందేహం మీకు రావచ్చు..
Advertisement
విద్యాసాగర్ ఆయన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. విద్యాసాగర్ చాలా రోజుల క్రితమే తన తండ్రిని కోల్పోయాడు. చివరి కార్యక్రమాలు చేయాల్సింది కొడుకు లేదా తండ్రి చేయాలి. వారిద్దరూ లేకపోవడంతో మీనా స్వయంగా తన భర్త చివరి కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. ఆరోజు చివరి కార్యక్రమాలకి బంధువులు, ఇండస్ట్రీ వర్గాలు, మీనా బంధువులు అందరూ తరలి వచ్చారు కానీ అక్కడికి విద్యాసాగర్ తల్లి, అంటే మీనా గారి అత్త రాలేదట. సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మీనా అత్త తన కొడుకు చివరి చూపులకు కూడా లేకపోయింది.
Advertisement
దాని వెనుక కారణం తెలిస్తే మనం కంటతడి పెడతాం.ఎందుకంటే మీనా అత్త కూడా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం వల్ల ఆమె కదల్లేని స్థితిలో ఉన్నట్టు, అందువల్ల తన కొడుకు చివరి చూపు కూడా నోచుకోలేక పోయారని సినీ వర్గం వారంటున్నారు. ఒక పక్క తన కొడుకును చివరి చూపు చూసుకోలేదు అని బాధ తల్లిని మరింత కుంగదీసిందని తెలుస్తోంది. ఓవైపు మీనా భర్తను పోగొట్టుకుని బాధపడుతూ ఉంటే, మరోవైపు ఆమె అత్త ఆ విధంగా ఉండడం తో ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
also read:
వీల్ చైర్ లో ఫుడ్ డెలివరీ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా !