Advertisement
దర్శకుడు, నటుడు, మ్యూజిక్ దర్శకుడు, నిర్మాత, బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆ-త్మ-హ-త్య చేసుకున్న సంఘటన సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున సమయంలో ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. గత రెండు మూడు నెలలుగా డిప్రెషన్ లో ఉన్న మీరా ఒత్తిడి తట్టుకోలేకే ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విజయ్ ఆంటోనీ కుటుంబాన్ని కలిసి తమ సంతాపాన్ని తెలిపారు. ఈ కేసు విషయమై చెన్నై పోలీసులు ఈ కేసుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. మీరా ఆ-త్మ-హ-త్య చేసుకున్న గదిని పరిశీలించారు. మీరా ఫోన్ ను కూడా సీజ్ చేశారు. ఆమె ఫోన్ లో చివరిగా ఎవరి కాల్ వచ్చింది.. ఎవరికి మెసేజ్ వెళ్ళింది అన్న విషయాలపై కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.
Advertisement
అయితే.. విజయ్ ఆంటోనీ తన కూతురుతో చివరగా ఎప్పుడు మాట్లాడారు, ఏమి మాట్లాడారు అన్న విషయమై ఓ వార్త వైరల్ అవుతోంది. కొన్ని నెలల క్రితమే బిచ్చగాడు 2 షూటింగ్ సమయంలో పెద్ద యాక్సిడెంట్ కు గురి అయిన విజయ్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కూతురి మరణం ఆయన్ని మరింత కుంగదీస్తోందనే చెప్పాలి. గతంలో ఆయన తండ్రి కూడా ఇలానే చనిపోతే.. ఇటువంటి పనులు చేయడం పాపం అంటూ ఉపన్యాసాలు ఇస్తూ యాంటీ సూ***డ్ ప్రోగ్రామ్స్ ను ఇవ్వడం ప్రారంభించాడు.
Advertisement
కానీ కూతురు కూడా ఇలాంటి పనే చేయడాన్ని విజయ్ తట్టుకోలేకపోతున్నాడు. రెండు రోజుల ముందు రాత్రి కూడా తల్లితండ్రులతో కలిసి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన మీరా ఇలా ఎందుకు చేసిందో విజయ్ కు అర్ధం కావడం లేదు. చనిపోయే ముందు రోజు రాత్రి కూడా మీరా తండ్రితో చక్కగా మాట్లాడిందట. ఏ చిన్న విషయాన్నీ అయినా ముందుగా తండ్రికే చెప్పే మీరా చెప్పుకోలేని బాధ మనసులో దాచి.. ఇటువంటి పని చేయడం నమ్మలేక పోతున్నానని విజయ్ బాధపడుతున్నారు. కాలేజీ నుంచి వచ్చినప్పటి నుంచే మీరా డల్ గా ఉందట. ఆంటోనీ తన ప్రమోషన్స్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే సమయానికి మీరా కూడా తండ్రితో ప్రేమగా మాట్లాడిందట. దాదాపు రెండు గంటల సమయం వరకు తండ్రితోనే గడిపిన మీరా పడుకోవడానికి వెళ్లి.. మూడు గంటల సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. తండ్రితో ప్రత్యేకంగా సమయం గడపడానికే ఆమె ముందు రోజు రాత్రి అంత సేపు తండ్రితో మాట్లాడిందని అర్ధం అవుతోంది. కాలేజీలో ఒత్తిడి భరించలేకే ఆమె ఇలాంటి పని చేసి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని…