Advertisement
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూలు చేసింది జైలర్ మూవీ కావడం విశేషం. ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రారంభం నుంచే భారీ వసూళ్లను రాబట్టింది. చాలా రికార్డులు క్రియేట్ చేసింది. తలైవా ఈస్ బ్యాంక్ అంటూ రజినీ అభిమానులు సంబురాలు చేసుకునేలా విజయాన్ని దక్కించుకుంది.
Advertisement
జైలర్ మూవీలో ముత్తువేల్ పాండియన్ పవర్ పుల్ పాత్రలో కనిపించారు రజినీకాంత్. రిటైర్డ్ జైలర్ పాత్రను పోషించారు. రజినీకాంత్ స్టైల్, యాక్షన్ ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంది. బీస్ట్ పరాజయం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రంతో సూపర్ హిట్ సాధించారు. ఈ సినిమాను తొలుత సూపర్ స్టార్ రజినీకాంత్ కంటే ముందే వేరే హీరోతో చేయాలనుకున్నాడట దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
Advertisement
తెలుగులో తొలి డెబ్యూ మూవీగా ఇదే చేయాలనే ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజుని కలిసాడట. ఈ స్టోరీ లైన్ వినగానే మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారట. చిరంజీవికి స్టోరీ మొత్తం వినిపించినా తరువాత ఆయనకు బాగా నచ్చింది. కానీ ఇలాంటి సబ్జెక్టులో నన్ను నా అభిమానులు చూడగలరా..? రీ ఎంట్రీ తరువాత పూర్తిగా కమర్షియల్ సినిమాలే చేస్తున్నాను. ఇలాంటి సమయంలో ఇటువంటి సబ్జెక్టస్ ని ఎంచుకోవడం రిస్క్ అని భావించి ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించడం లేదట చిరంజీవి.