Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు.
Advertisement
అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా కొనసాగుతున్న రోజుల్లో అనగా 1982 లో రెండు సార్లు ఆయన నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజున విడుదల అయ్యాయి. ఇక 1982లో జూలై 30వ తేదీన చిరంజీవి హీరోగా నటించిన సీతాదేవి, అలాగే రాధా మై డార్లింగ్ సినిమాలు విడుదల అయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన పట్నం వచ్చిన పతివ్రతలు అలాగే టింగు రంగడు సినిమాలు కూడా విడుదల అయ్యాయి.
Advertisement
ఇక పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకు మౌళి దర్శకత్వం వహించగా చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించారు. వారి సరసన రాధా, గీతా నటించారు. అలాగే చిరంజీవి సోలో హీరోగా నటించిన టింగు రంగడు సినిమాలో కూడా హీరోయిన్ గీత చిరంజీవికి జోడిగా నటించింది. అంటే పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో చిరంజీవికి వదినగా నటించిన గీత ఈ సినిమాలో చిరంజీవితో కలిసి రొమాన్స్ చేసిందన్నమాట. ఈ సినిమాకు టిఎల్వి ప్రసాద్ దర్శకుడిగా వ్యవహరించారు. కాగా, ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా వినోదాన్ని పంచగా, టింగు రంగడు సినిమా మాస్ తో జనాన్ని ఆకట్టుకుంది.
Read also : ఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న కండక్టర్ ఝాన్సీ!