Advertisement
వాల్తేరు వీరయ్య మూవీలో ఫస్ట్ స్టాప్ లో విలన్ క్యారెక్టర్ చేసిన బాబి సింహాని అందరూ తమిళ నటుడు అని భావించారు. కానీ ఆయన తెలుగు వారే.. కృష్ణాజిల్లా దివిసీమలో మోపిదేవి మండలం కోసూరు వారి పాలెం కు చెందిన వ్యక్తి. వాల్తేరు వీరయ్యలో విలన్ గా చిరంజీవితో సమానంగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి బాబి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో స్థాయికి ఎదిగాడు. విక్రమ్ స్వామి అనే తమిళ చిత్రంలో తనదైన వీలనిజంతో అందరిని మెప్పించాడు. హీరో విక్రమ్ తో పోటీపడి నటించి తమిళ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక వాల్తేరు వీరయ్య మూవీతో సాల్మన్ సీజర్ గా చిరుతో పోటీపడి నటించి మంచి గుర్తింపు సాధించాడని చెప్పవచ్చు.
Advertisement
Advertisement
2010లో తొలిసారిగా ది ఏంజెల్ అనే షార్ట్ ఫిలిం బాబీ సింహా రూపొందించాడు. ఆయన మొత్తం తొమ్మిది షార్ట్ ఫిలింమ్స్ తీయగా “విచిత్తిరిం” అనే షార్ట్ ఫిలింకు 2012లో బెస్ట్ యాక్టర్ ఇన్ లిటిల్ షోస్ అనే అవార్డు దక్కింది. ఈ చిత్రమే ఆయనకు సినీ అవకాశాలు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో దాదాపు 40 చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో నటించారు. దీని తర్వాత సైజ్ జీరో రన్ చిత్రాల్లో నటించాడు.
ఆయన తెలుగువాడైనా సరే తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. చదువుకునే రోజుల్లో చిరంజీవిని దగ్గరగా చూడాలని ఆశ ఉండేదట. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో ఆయనతో కలిసి నటించడం మర్చిపోలేనిది అంటూ ఆయన చెప్పారు. మోపిదేవి లో చదువుకున్న రోజులు ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయని, తమిళ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానం మర్చిపోలేనని, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేస్తానని ఆయన తెలియజేశారు.
also read: