Advertisement
మేఘాలయలో ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం 60 స్థానాలున్న ఈ బుల్లి స్టేట్ లో ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు వెలువడతాయి. ఎన్పీపీ, కాంగ్రెస్, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. కాస్తో కూస్తో బలగం ఉన్న టీఎంసీ, యూడీపీ ఇంకా పలు పార్టీలు పోటీకి దిగాయి. 2018 ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ 20 స్థానాల్లో గెలిచింది. బీజేపీకి రెండు స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచింది. కానీ, ఈసారి గెలుపు తమదేని బీజేపీ అంటోంది.
Advertisement
మేఘాలయపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బీజేపీ.. ప్రధాని మోడీని రంగంలోకి దింపింది. ఈసారి ఎన్పీపీతో పొత్తు లేదు. ఒంటరిగానే బరిలోకి దింగింది. అయితే.. అనూహ్యంగా సీఎం కాన్రాడ్ సంగ్మా మోడీకి షాకిచ్చారు. సౌత్ తురాలో పీఏ సంగ్మా స్టేడియంలో స్టేడియంలో ప్రధాని ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇది ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గం.
Advertisement
సీఎం నిర్ణయంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేఘాలయలో ఈసారి కచ్చితంగా తమ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు ఎన్పీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని.. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈసారి కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేస్తామని స్పష్టంచేశారు కమలనాథులు.
అయితే.. జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఇష్యూపై స్పందించారు. పీఏ సంగ్మా స్టేడియంలో పెద్దస్థాయిలో ర్యాలీ నిర్వహించడం సరికాదన్నారు. స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. పైగా నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఉందని తెలిపారు. అందుకే ప్రధాని మోడీ సభకు అనుమతివ్వలేదని పేర్కొన్నారు. పత్యామ్నాయ వేదికగా అలోట్ గ్రే క్రికెట్ స్టేడియం పరిశీలిస్తున్నామని చెప్పారు. 127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి ప్రారంభించారు.