Advertisement
40 దాటిన పురుషులు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 40 తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు మరి మీకు కూడా 40 ఏళ్లు దాటాయా..? మరి ఈ విషయాలని కచ్చితంగా పాటించండి హెల్దిగా ఉంటారు. సాల్మన్ మొదలైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి మెగ్నీషియంతో పాటుగా క్యాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. గుండెని ఆరోగ్యంగా మారుస్తుంది మెదడు కూడా చురుకుగా పని చేస్తుంది. 40 దాటిన వాళ్లు ఆకుకూరని కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. 40 దాటిన పురుషులు పాలకూర, కాలే, తోటకూర వంటి ఆకుకూరలని రెగ్యులర్ గా తీసుకోవాలి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
Advertisement
Advertisement
బాదంపప్పు, వాల్నట్స్ మొదలైన నట్స్ లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ తో పాటుగా ఐరన్, ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్ కూడా ఉంటాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. తృణధాన్యాలను కూడా డైట్లో చేర్చుకోండి. ఓట్స్, క్వినోవా మొదలైన తృణధాన్యాలని తీసుకోవడం వలన హెల్తీగా ఉండవచ్చు. కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. బెర్రీస్ ని కూడా తీసుకుంటూ ఉండండి. బెర్రీస్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె సమస్యలు రావు.
Also read:
విత్తనాలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుమ్మడి గింజల్లో అవిసె గింజలు సమృద్ధిగా ఉంటాయి. వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే కీళ్ల నొప్పులు మొదలు ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు. 40 ఏళ్ళు దాటిన పురుషులని ప్రోటీన్ కూడా తీసుకోవాలి. శనగలు, పప్పు దినుసులు వంటివి తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. గుండె సమస్యలు రావు. టమాటాలని. కోడి గుడ్లని కూడా రెగ్యులర్ గా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు తీసుకోవడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!