Advertisement
వైవాహిక జీవితంలో భార్యాభర్త ఇద్దరు కూడా సంతోషంగా ఉండడానికి చూసుకోవాలి. సాధారణంగా స్త్రీలు రహస్యాలని ఉంచుతారని అంటారు. కానీ వాస్తవానికి పురుషుల తమ ఆలోచనలు భావాలను తన భార్యలతో పంచుకోకుండా మనసులో రహస్యంగా ఉంచుతారు. పురుషులు ఇలాంటి విషయాలని దాచుకోవడానికి కారణం వారు తమ భాగస్వామి నమ్మకపోవడం. సామాజిక ఒత్తిడి, వ్యక్తిగత అభద్రతా భావాలు వారి మనసులో అలాంటి విషయాలను దాచడానికి బలవంతం చేస్తాయి. భార్య చేసే చిన్న చిన్న పనులకు కూడా పురుషులు సంతోష పడుతూ ఉంటారు.
Advertisement
కానీ వాళ్ళు ఆ ఆనందాన్ని బాహ్యంగా వ్యక్తం చేసి ఉండకపోవచ్చు లేదా అభినందించకపోయి ఉండొచ్చు. పురుషులు దృఢమైన మనసు, కఠినమైన హృదయం కలిగి ఉంటారని ఈ సాధారణ భావన కారణంగా చాలామంది పురుషులు బలహీనతను సమాజం ముందు మాత్రమే కాకుండా కుటుంబం భార్య ముందు కూడా చూపించడానికి ధైర్యం చేయరు. అలాగే స్త్రీ పురుషులు ఎలా ఉండాలో సమాజం అనే ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఇలాంటి ప్రమాణాలు పురుషులు మహిళలు ఇద్దరికీ కూడా ఒత్తిడిని కలిగిస్తాయి.
Advertisement
Also read:
పురుషులు మానసికంగా దృఢంగా ఉండాలి. వారి భావోద్వేగాలని నియంత్రించాలి కొన్నిసార్లు పురుషులు కొంత కాలం ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. వారి మనసులో ఉన్న ప్రతిదాన్ని విడిచి పెట్టి సంతోషాన్ని శాంతిని కనుగొనలనుకుంటారు. కానీ వారు భాగస్వామికి చెప్పడానికి ఇష్టపడరు. సమాజం పురుషులు తమ భాగ్యస్వామిని, కుటుంబాన్ని రక్షించడం వారు కోరుకున్నది చేయడం వంటి వాటిని చూస్తుంది. ఈ సమయంలో పురుషులు అనుకున్నది సాధించలేం ఏమో అని భయపడుతూ ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!